చంద్రబాబుకు అవినీతి,అక్రమాలు రెండు కళ్లు...

 

చంద్రబాబుకు అవినీతి,అక్రమాలు రెండు కళ్లు...

ప్రజలను మభ్యపెట్టేందుకు  కుట్రలు

ప్రజల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది...

వైయస్‌ఆర్‌సీపీ నేత ఆదిమూలం సురేష్‌..

 విజయవాడ: వైయస్‌ఆర్‌ హయాంలోఅభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగింతే..చంద్రబాబు పరిపాలనలో అవినీతి,అక్రమాలు రెండుకళ్లుగా సాగుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆదిమూలం సురేష్‌ అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర  కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముంగిట ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిపారు. ఆషాడం సేల్స్‌ లాగా ఎలక్షన్‌ సమయంలో చంద్రబాబుకు అన్ని హామీలు గుర్తుకువస్తాయన్నారు. 2014లో ఆరువందలకుపైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు..ఎన్నికల తరుణంలో ప్రజలను మభ్యపెట్టి ఏవిధంగా ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలి అనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ముందుకువెళ్తున్నారన్నారు. దీనికి నిదర్శనం నిన్న జరిగిన కేబినేట్‌ సమావేశం అని అన్నారు.

ప్రజలను మోసగించడానికి కొన్ని పథకాలు చంద్రబాబు పైకి తీసుకొస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ఒక్కొక్కటిగా చంద్రబాబు కాపీ చేస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2 వేల రూపాయలు పింఛను,వికలాంగులు మూడువేల రూపాయలు పింఛను ఇస్తామని వైయస్‌ఆర్‌ భోరోసా అనే పథకం రూపొందించారన్నారు.ఇంతకాలం పెన్షన్‌ పెంచాలనే ఆలోచన చంద్రబాబుకు రాలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే కుట్రలు చేస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబుకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఐదు సంవత్సరాల వరుకు పింఛన్లు ఏవిధంగా ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు అని అన్నారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మాయ చేస్తున్నారన్నారు. ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్లలు ఆరేసుకుంటామని చెప్పిన చంద్రబాబు నేడు ఉచిత కరెంటు ఇస్తామనటం హస్యాస్పదమన్నారు.

ప్రత్యేకహోదా తప్పనిసరి అని వైయస్‌ జగన్‌ పోరాటం చేశారని..చంద్రబాబు మాత్రం ఒక్కోసారి ప్రత్యేక ప్యాకేజీ అంటారు. మరోసారి ప్రత్యేకహోదా అంటారని విమర్శించారు. ప్రత్యేకహోదా అంశాన్ని ఎత్తితే జైల్లో కూడా పెడతామని చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తుచేశారు. కోటి 50 లక్షల ఇళ్లు ఉంటే..ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి..ఉద్యోగం ఇవ్వలేకపోతే 2వేల రూపాయలు నిరుద్యోగభృతి  ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు  వరుకూ నిమ్మకు నీరెత్తినట్లు ఉండి కేవలం ఎన్నికల తరుణంలో డ్రామాలు మొదలుపెట్టారన్నారు.ఇచ్చిన హామీలను ఒకటి కూడా చంద్రబాబు అమలు పర్చలేదన్నారు. అగ్రకులాలకు రిజర్వేషన్ల అంశంపై కులాల మధ్య చిచ్చుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి పని జూన్‌ తర్వాత చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, ఎక్కడిపడితే అక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. శిలాఫలకాల పునాది రాళ్లు..అభివృద్ధికి సమాధి రాళ్లా అని ప్రశ్నించారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.

 

Back to Top