ఫ్లైఓవర్‌ కట్టలేని చంద్రబాబు.. అమరావతిపై ప్రగల్భాలు

కనకదుర్గ, బెంజ్‌ సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ నిర్మించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

నాడు–నేడు తరహాలో రూ.2,250 కోట్లతో 8,268 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి 

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

అసెంబ్లీ: చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కూడా పూర్తిచేయలేకపోయాడని, ఓ ఫ్లైఓవర్‌ను నిర్మించలేని వ్యక్తి.. లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు చేసి అమరావతి నిర్మిస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరమని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేసి కేంద్రమంత్రితో ప్రారంభోత్సవం చేయించారన్నారు. ఆర్‌అండ్‌బీపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడారు. 

జాతీయ రహదారులకు గత ప్రభుత్వం ఐదేళ్లలో 1,671 కిలోమీటర్లకు రూ.10,848 కోట్లు ఖర్చు చేస్తే.. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం మూడేళ్లలో 1943 కిలోమీటర్లను రూ.12,738 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసిందన్నారు. మరో 365 కిలోమీటర్లకు సంబంధించి రూ.2,305 కోట్లను కేంద్రాన్ని ఒప్పించి మంజూరు చేయించారన్నారు.  గత ప్రభుత్వంలో అధికార పార్టీ నుంచి కేంద్రమంత్రులుగా ఉన్నప్పటికీ వారు సాధించలేని ఘనత.. మూడేళ్లలో సీఎం వైయస్‌ జగన్‌ సాధించి చూపించారన్నారు. అంతేకాకుండా జాతీయ రహదారుల అభివృద్ధిపై భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. 

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే దృక్పథంతో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పారు. 872 కిలోమీటర్ల 10 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా మార్చారన్నారు. 2015లో చంద్రబాబు మొదలుపెట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ 18 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా.. బాబు తన ఐదేళ్ల పాలనలోనూ నిర్మించలేకపోయారని, ఓ ఫ్లైఓవర్‌ కట్టలేని చంద్రబాబు.. లక్ష కోట్ల రూపాయలతో అమరావతి నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  

సీఎం వైయస్‌ జగన్‌ కనకదుర్గ ఫైఓవర్‌ను పూర్తిచేయించి కేంద్రమంత్రితో ప్రారంభోత్సవం చేయించారన్నారు. అదేరోజున రూ.15,592 కోట్ల వ్యయంతో  1,411  కిలోమీటర్లకు సంబంధించిన 61ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవం జరిగిందన్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రెండో ఫ్లైఓవర్‌ కూడా కావాలని చెప్పి 2019లో ఢిల్లీ వెళ్లిన సీఎం వైయస్‌ జగన్‌.. ఆ ఫ్లైఓవర్‌ను మంజూరు చేయించారని,  ఒక్క సంవత్సరకాలంలోనే నిర్మానం పూర్తిచేసి ప్రారంభించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. . 

రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు చేసిన తరువాత వ్యత్యాసం స్పష్టంగా కనిపించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గుర్తుచేశారు. ఎవరూ విమర్శించే అవకాశం ఉండకూడదని, వాహనదారులకు స్పష్టమైన తేడా కనిపించాలని, నాడుl– నేడు తరహాలో రోడ్ల ఫొటోలు తీసి వ్యత్యాసం చూపిద్దామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. ఏకంగా రూ.2,250 కోట్లు మంజూరు చేసి.. 8,268 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయిస్తున్నారన్నారు. 
 

Back to Top