అమరావతి: తొడలు కొడితే కుర్చీరాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం వస్తుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే స్పీకర్ కుర్చీ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం అనైతికమని మండిపడ్డారు. ప్రజలకు తెలియ చేయాల్సిన విషయాలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ సభ్యులు సాక్షాత్తు స్పీకర్‌పై దాడి చేయడం విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడారు. విలువలేకుండా ఏదో మాయ మాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పేదల కోసం ఆలోచించి, పేదల కోసం జీవించే ప్రభుత్వం మనదని చెప్పారు. పేదలకు అండగా ఉండాలనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న సీఎం వైయస్ జగన్ చూసి చాలా ఆనందంగా ఉందన్నారు. నిజమైన నాయకుడు అనేవాడు ప్రజల అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తాడు అదే సీఎం వైయస్ జగన్ చేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ను వ్యక్తిలా కాకుండా సిద్ధాంతంలా తీసుకుని ముందుకు వెళుతున్న నాయకుడు సీఎం వైయస్ జగన్ అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొనియాడారు. విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మార్చి పిల్లలకు మేనమామలా ఉన్న వ్యక్తి మనం సీఎం వైయస్ జగన్, హెల్త్ కేర్‌ను ప్రతీ పేదవాడికి అందిస్తున్న నాయకుడు సీఎం వైయస్ జగన్ అని వివరించారు. ప్రతీ ఒక్కరికి హెల్త్ కేర్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లోనే సాధ్యం కాలేదు.. కానీ పేదవారికి వైద్యం అందించాలనే ఆలోచన చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్. ఆరోగ్యశ్రీని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ది..జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో గొప్పదన్నారు. ఆరోగ్యానికి పేదవాడి చేతిల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టకూడదని ఆలోచన చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్ ఈరోజు పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంటే అందుకు కారణం సీఎం వైయస్ జగన్ అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు.