ఇదీ చేతల ప్రభుత్వం 

ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి
 

ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట తప్పని నేత అని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేతల ప్రభుత్వమని దెందలూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పేర్కొన్నారు. డేట్‌ చెప్పి మరీ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఏలూరులో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లకు ఏటా రూ.10 వేల చొప్పున  ఇస్తామని హామీ ఇచ్చి..ఇవాళ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి తల్లుల ఖాతాలో రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఇది చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Back to Top