టీడీపీ పాలనలో ముస్లింలకు అన్యాయం

మైనార్టీల సంక్షేమాన్ని గాలికొదిలేశారు

ముస్లింల ఆత్మీయ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు 

నెల్లూరు జిల్లా: టీడీపీ పాలనలో ముస్లిం సోదరులు కడు దుర్భర స్థితిలో జీవిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీనేతలు అన్నారు.కావలిలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు.ముస్లిం ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు.డ్రైనేజి వ్యవస్థ కూడా లేక ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  మైనార్టీ సోదరులుకు టీడీపీ పాలనలో అన్యాయమే జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.

Back to Top