ప్రకాశం జిల్లా కందుకూరులో ఉద్రిక్తత

వైయస్‌ఆర్‌సీపీ నేతతో సహా ముగ్గురు కార్యకర్తలు అక్రమ అరెస్ట్‌

పోలీసుల తీరుపై వైయస్‌ఆర్‌సీపీ నేత మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆగ్రహం 

టీడీపీ నేతల దౌర్జన్యంపై వైయస్‌ఆర్‌సీపీ నిరసన

ప్రకాశం: టీడీపీ దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు కూడా అధికార టీడీపీ పార్టీ అండతో ఏకపక్షంతో వ్యవహరిస్తున్నారు.  కందుకూరు వైయస్‌ఆర్‌సీపీ  పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీతో పాటు ముగ్గురు కార్యకర్తలను పోలీసులు  అక్రమ అరెస్ట్‌లు చేశారు. ఓట్ల సర్వే చేస్తున్నవారిని అప్పగించినందుకు అక్రమ అరెస్ట్‌లు చేశారు. నిన్న రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో టీడీపీ నేతలు  రఫీపై దాడికి యత్నించి చంపుతానని బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరుపై కందుకూరు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమ అరెస్ట్‌పై పోలీసులను నిలదీశారు.విచారణ లేకుండా అరెస్ట్‌లు ఎలా చేస్తారని ప్రశ్నించారు.టీడీపీ నేతల దౌర్జన్యంపై వైయస్‌ఆర్‌సీపీ నిరసన వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top