టీడీపీ పాలనలో అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే..

చంద్రబాబు పాలన శంకుస్థాపనలకే పరిమితం

వైయస్‌ జగన్‌ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు

వైయస్‌ఆర్‌సీపీ కొండేపి అభ్యర్థి మాదాసి వెంకయ్య

ప్రకాశం జిల్లా: టీడీపీ పాలనలో కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడివేసిన గొంగళి అక్కడే ఉందని వైయస్‌ఆర్‌సీపీ కొండేపి నియోజకవర్గం అభ్యర్థి మాదాసి వెంకయ్య అన్నారు. నియోజకవర్గంలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. తాగునీరు,సాగునీరు  కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.టీడీపీ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యిందని మండిపడ్డారు. సంగమేశ్వర ప్రాజెక్టును  శంకుస్థాపన మాత్రమే చేశారని, ఒక అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు.  పర్సంటేజ్‌లు కుదురక  నిలిపివేశారన్నారు. మూసినది మీద చెక్‌ డ్యామ్‌లు నిర్మిస్తే తాగునీరు, సాగునీరు సమస్య కొంతవరుకు తీరుతుందన్నారు.మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెలుగొండ కోసం పాదయాత్ర కూడా చేశారన్నారు.వెలుగొండ ప్రాజెక్టు కుడి ఛానెల్‌ కొంత విస్తరిస్తే మరి కొన్ని మండలాలకు ఉపయోగపడుతుందన్నారు.వైయస్‌ జగన్‌ సీఎం అయితే రైతులతో పాటు అన్నివర్గాలకు మేలు జరుగుతుందన్నారు.
 

Back to Top