`ప‌రిష‌త్‌` ఫ‌లితాల్లో వైయ‌స్ఆర్ సీపీ జోరు

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో వైయ‌స్ఆర్ సీపీ ఆధిక్యం

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెల్లడి కాబోతున్నాయి. 7,219 ఎంపీటీ, 515 జెడ్పీటీసీ స్థానాలకు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు సంబంధించి కోర్టు ఆదేశాల మేర‌కు కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ కౌంటింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఏప్రిల్‌ 8వ తేదీన 7,219 ఎంపీటీసీ, 515 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితమైంది. మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది.

మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాల‌కు 126 స్థానాలు ఏక‌గ్రీవం కాగా, వివిధ కార‌ణాల‌తో 19 స్థానాల‌కు ఎన్నిక‌లు ఆగిపోయాయి. 515 జెడ్పీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అదే విధంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల‌కు 2,371 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. వివిధ కార‌ణాల‌తో 457 స్థానాల‌కు ఎన్నిక‌లు నిలిచిపోయాయి. కాగా, 7,219 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. మొత్తం 515 జెడ్పీటీసీ, 7,219 ఎంపీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ఆధిక్యం కొన‌సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మ‌రికొన్ని చోట్ల ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపులో ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థుల హ‌వా సాగుతోంది. నెల్లూరు జిల్లాలో 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైయ‌స్ఆర్ సీపీ) గెలుపొందారు. ప‌శ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు జెడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైయ‌స్ఆర్ సీపీ ఆధిక్యంలో ఉంది. వైయ‌స్ఆర్ జిల్లా కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైయ‌స్ఆర్ సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top