ఊరూరా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’

రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు 

అమ‌రావ‌తి‌: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా   వైయ‌స్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభ‌మైన సంఘీభావ యాత్ర‌లు ఊరూరా సాగుతున్నాయి. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, వేటపాలెంలో ఆమంచి కృష్ణమోహన్, టంగుటూరులో డాక్టర్‌ వెంకయ్య, బల్లికురవలో బాచిన కృష్ణచైతన్య, గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు చేశారు. చిత్తూరు జిల్లాలో  మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు రోజా, ద్వారకానాథ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, నవాజ్‌ బాషా ఆధ్వర్యంలో ఈ పాదయాత్రలు జరిగాయి.

కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని, మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు.. పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు.. సుదీర్‌రెడ్డి, రఘరామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలో ఆయా కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ గొడ్డేటి మాధవి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, వీఆర్‌ ఎలీజా, తలారి వెంకట్రావు, గ్రంథి శ్రీనివాస్‌ పాదయాత్ర చేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top