అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు

వలసలపై మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్పంద‌న 

గుంటూరు : ప్రజలను దృష్టి మరల్చేందుకు.. రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై తమ స్పందన తెలియజేస్తున్నారు. 

అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై అంబటి రాంబాబు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు.. ఇది చారిత్రిక సత్యం!  అని అన్నారు.

చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా?:  కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
సభ్యుల పార్టీ మార్పుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి  స్పందించారు.  వైయ‌స్‌ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఫైర్‌ అయ్యారు.  గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే చంద్రబాబు పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజలను దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారినవారు కాలగర్బంలో కలిసిపోయారు. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదు అని అన్నారు. 

  

Back to Top