బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష.. లేకపోతే మరో భాష  

త‌ణుకు జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు

పశ్చిమ గోదావరి జిల్లా:  చంద్ర‌ బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష.. లేకపోతే మరో భాష మాట్లాడతారని ఎమ్మెల్యే ఎమ్మెల్యే  కారుమూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తణుకు రాష్ట్రపతి రోడ్ లో ఎమ్మెల్యే  కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేతలు..  సీఎం వైయ‌స్ జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై..    వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పట్టాభి వెంటనే సీఎం వైయ‌స్ జగన్ కు బేషరతుగా  క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.  జనాగ్రహ దీక్షలో  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.  

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు  గాంధీ బొమ్మల సెంటర్లో  జెడ్పీ చైర్మన్ కావురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలో కొనసాగుతుంది. ఈ దీక్షలో  మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ,ఎంపిపి లు చిట్టూరి కనక లక్ష్మి,రావూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే  గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతుంది.ఈ  జనాగ్రహ దీక్షలో వైయ‌స్ఆర్ సీపీ శ్రేణులు  భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి  శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవ్వరు చూస్తువూరుకోరని అన్నారు. టీడీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారి పోయారో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతుందని గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. పవన్ కల్యాణ్ కు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని అన్నారు.భవిష్యత్ లో ఒక్క సీటుకే..బాబు పరిమితం అవుతారని అన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top