బీసీలంతా త‌లెత్తుకొని తిరిగేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న

ఇన్నాళ్ల‌ బీసీల వెనుక‌బాటుత‌నానికి చంద్ర‌బాబే ప్ర‌ధాన కార‌ణం

సీఎం వైయ‌స్‌ జగన్ బీసీలకు అండ‌గా నిలిచారు

మంత్రులు వేణుగోపాల‌కృష్ణ‌, జోగి ర‌మేష్‌, ఎంపీ ఆర్‌. కృష్ణ‌య్య‌

జయహో బీసీ మహాసభపై వైయ‌స్ఆర్ సీపీ ముఖ్యనేతల సమావేశం

తాడేప‌ల్లి: బీసీల వెనుకబాటుత‌నానికి ప్రధాన కారణం చంద్రబాబేన‌ని, బీసీలు విద్య కోసం విదేశాలకు  వెళ్లకుండా అడ్డుకున్నాని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీలను చంద్ర‌బాబు వాడుకున్నాడ‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈనెల 7వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ జయహో బీసీ మహాసభపై వైయ‌స్ఆర్ సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో  స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ ఆర్‌.కృష్ణ‌య్య‌, పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇత‌ర ముఖ్య‌నేత‌లు హాజరయ్యారు. 

స‌మావేశం అనంత‌రం మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ.. వెనుక వరసలో ఉన్న బీసీలను సీఎం వైయ‌స్‌ జగన్ ముందుకు తీసుకువ‌చ్చార‌న్నారు. పేదరికం పెద్ద రోగం కాబట్టి విద్య అనే ఆయుధం అందించారన్నారు. ఈనెల 7వ తేదీన 80 వేలమంది బీసీలు ఒకే వేదిక పైకి రాబోతున్నారన్నారు. జ‌య‌హో బీసీ మ‌హాస‌భ పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌నున్నామ‌న్నారు. స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. చంద్రబాబు ప్ర‌వ‌ర్త‌న‌ను చూసి `మాకు ఇదేం ఖర్మ బాబూ` అని బీసీలంతా  అనుకుంటున్నార‌న్నారు. చంద్రబాబు అబద్దాలను నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవ‌ని చెప్పారు. 

బీసీలంతా త‌లెత్తుకొని తిరిగేలా పాల‌న : మంత్రి జోగి రమేష్‌
గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ఈనెల 7న  జయహో బీసీ మహాసభకు వివిధ  హోదాలో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు 80 వేలకు పైగా హాజరవుతారని తెలిపారు. సామాజిక న్యాయం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌కే సాధ్యమన్నారు. ఈ మూడున్నరేళ్ల పాల‌న‌లో స‌మాజంలో వెనుక‌బాటుకు గురైన బీసీల‌ను ముందు వ‌రుస‌లో నిల‌బెట్టార‌న్నారు. బీసీలంతా తలెత్తుకుని తిరిగేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న సాగుతోంద‌న్నారు.  

బీసీలకు అత్యంత ప్రాధాన్యత: ఎంపీ ఆర్‌. కృష్ణయ్య
వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. గతంలో ఏ  సీఎం చేయని విధంగా సీఎం వైయ‌స్‌ జగన్ బీసీలకు న్యాయం చేశారన్నారు. దేశానికి వెన్నెముక అయిన బీసీలకు సీఎం వైయ‌స్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అభివృద్ధి అంటే అధికారంలో వాటా ఇవ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడమేన‌ని, బీసీల విషయంలో సీఎం ఇదే చేస్తున్నారని ఎంపీ కృష్ణయ్య అన్నారు.

Back to Top