రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుక

విజయవాడ: విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు..

గణతంత్ర దినోత్సవ వేడుకలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా, పట్టణ, మండల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. చంద్రబాబు పాలనలో రాజ్యాంగం మరుగున పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నాడని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగూనంగా జననేత పాలన చేస్తారన్నారు. 

 

Back to Top