వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమంపై ప్రభుత్వ దమననీతి

వైయస్‌ఆర్‌సీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌లు

మహాధర్నాకు భగ్నం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం హుకుం..

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కియా కార్ల కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ నేడు మహాధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చింది. ధర్నాను భగ్నం చేయాలంటూ చంద్రబాబు సర్కార్‌ పోలీసులకు హుకుం జారీ చేసింది. ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసులు అడ్డుకున్నారు.  హౌస్‌ అరెస్ట్‌తో పెనుకొండ సమన్వకర్త శంకర్‌ నారాయణ ప్లకార్డులతో ఇంట్లోనే నిరసన తెలిపారు. కియా ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేదాకా మా పోరాటం ఆగదని శంకర్‌ నారాయణ తెలిపారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి,రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హిందూపురంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పెనుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు నిర్భందంలో ఉంచారు. కియా ఫ్యాక్టరీ వద్ద జరిగే ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Back to Top