ఈసీకి వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు

ఓట్లు తొలగింపు వ్యవహారంపై ఫిర్యాదు

అమరావతి: ఎన్నికల కమిషనర్‌ ద్వివేదిని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. అక్రమ సర్వేలు, ఓట్లు తొలగింపు వ్యవహారంపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, మల్లాది విష్ణు, తదితరులు ఈసీని కలిశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో   ‘పీపుల్స్‌పోల్‌ సర్వే’ పేరిట కుమిలి గ్రామంలో కొంద‌రు వ్య‌క్తులు సర్వే ప్రారంభించార‌ని తెలిపారు.

ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితా ట్యాబ్‌లో వుండటంతో పాటు అధికారపార్టీకి అనుకూలంగా ప్రశ్నలు చేస్తున్నార‌ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.  అధికారపార్టీకి వ్యతిరేకంగా సమాధానాలిస్తున్న వ్యక్తుల వివరాలు ట్యాబ్‌లలో నమోదు చేసుకుని తర్వాత వారి ఓట్లు తొలగించే అవకాశం వుందని భావించి సర్వే సిబ్బందిని అడ్డుకున్నార‌ని తెలిపారు.

పూసపాటిరేగలో ప్రతిపక్షానికి చెందిన సుమారు 140 ఓట్ల వరకు ఫారం–7 ఇవ్వకుండానే తొలగింపుల జాబితాలో కనిపిస్తున్నాయ‌ని,  వీరంతా సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన వాయిస్‌ మెసేజీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానమిచ్చినవారని భావిస్తున్నారు. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఈసీని కోరారు. 

Back to Top