సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

అమరావతి: ఎన్నికల కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేదిని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. చెవిరెడ్డి అక్రమ నిర్బంధం, ఓట్ల తొలగింపు, సర్వేలపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకుంటున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా సుమారు 100 మందిని పోలీసులు అర్ధ‌రాత్రి అరెస్ట్‌ చేసి, రాత్రంతా పలు ప్రాంతాల్లో తిప్పి...చివరకు తెల్లవారుజామున సత్యవీడు పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. అప్పటి నుంచి ఆయన పీఎస్‌లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి పార్టీ నేత‌లు తీసుకెళ్లారు.    మంత్రి నారా లోకేష్‌ ప్రమేయంతోనే వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Back to Top