ఏబీఎన్‌ రాధాకృష్ణ, చంద్రబాబులపై చర్యలు తీసుకోవాలి

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు

 

 హైదరాబాద్‌: ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో వైయస్ఆర్ సీపీ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్‌ సెక్రటరీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. తన వాయిస్‌ని డబ్బింగ్‌ చేసి తన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏబీఎన్‌ ఛానల్‌లో కథనాలు వండివార్చారని ఆరోపించారు. కేసు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుండటంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు బదలాయించారు. విజయసాయి రెడ్డి తరపున వైయస్ఆర్ సీపీ  నాయకుడు చల్లా మధుసూదన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఛానల్‌లో టెలికాస్ట్‌ చేసిన ఆడియో, వీడియో, డిబేట్‌ వీడియోలను సాక్ష్యాలుగా ఫిర్యాదుదారుడు పొందుపరిచారు. రాధాకృష్ణతో పాటు దీని వెనక చంద్రబాబు కుట్ర దాగి ఉందని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Back to Top