శ్యామ్ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంది

శ్యామ్ కుటుంబ స‌భ్యుల‌కు పార్టీ యువ నేత‌ల ఓదార్పు 

బెంగ‌ళూరు: మహమ్మారి కరోనా బారిన పడి అకాల మ‌ర‌ణం పొందిన‌  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్యాం కలకడ కుటుంబానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయ‌కులు వై. విక్రాంత్‌రెడ్డి, తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి, ఏపీడీసీ వైస్ చైర్మ‌న్, ఎండీ చిన్న వాసుదేవ‌రెడ్డిలు భ‌రోసా క‌ల్పించారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు బుధ‌వారం బెంగ‌ళూరులోని శ్యామ్ కుటుంబ స‌భ్యుల‌ను వై. విక్రాంత్‌రెడ్డి,   డాక్ట‌ర్ గురుమూర్తి,  చిన్న వాసుదేవ‌రెడ్డిలు ప‌రామ‌ర్శించి, ఓదార్చారు.  శ్యామ్ మ‌ర‌ణం ప‌ట్ల వారు విచారం వ్యక్తం చేశారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు పార్టీ కోసం అనుక్షణం ప‌నిచేసిన క్రియాశీలక కార్య‌క‌ర్త శ్యామ్ క‌ల‌క‌డ అని కొనియాడారు. శ్యామ్‌ పవిత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్ర‌సాధించాల‌ని వారు ఆకాంక్షించారు.   

తాజా వీడియోలు

Back to Top