చిత్తశుద్ధిలేని నేత చంద్రబాబు...

చంద్రబాబు విధానాలు అప్రజాస్వామికం..

వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవివిఎస్‌ నాగిరెడ్డి..

విజయవాడ: ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని  వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవివిఎస్‌ నాగిరెడ్డి  ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నాలుగున్నర సంవత్సరాల్లో ఒకసారి కూడా అఖిలపక్షం కనబడలేదని మండిపడ్డారు.  ఎన్నికలకు మూడు నెలలు ముందు గుర్తుకువచ్చిందని దుయ్యబట్టారు. బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చిత్తశుద్ధితో కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఎన్నికల ముందు అఖిలపక్షం అంటూ చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాల్లో చిత్తశుద్ధి లేదన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ఆర్‌  ఎన్నికలకు వెళ్లేముందు కొత్తగా ఒక హామీ కూడా ఇవ్వకుండా ఆయన అమలు చేసిన కార్యక్రమాలు చూసి ఓటు వేయమని అడిగి ఎన్నికలకు వెళ్ళారని గుర్తుచేశారు. నాయకత్వ లక్షణం అది అని కొనియాడారు. రాజధాని విషయంలో ప్రతిపక్షంతో  చర్చించిన తర్వాత ప్రకటించాలని  కోరితే..  ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని అని, నాకు ఎవరూ సలహాలు,సూచనలు ఇవ్వనవసరం లేదని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. నాలుగున్నర పాలన కాలంలో ఒకసారి కూడా రైతు సంఘాలతో సమావేశం జరపలేదని మండిపడ్డారు.ప్రజలను మోసం చేయడానికి అఖిలపక్షం సమావేశం అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసపూరిత విధానాలు ప్రజలు గ్రహించాలన్నారు. మొదట నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా అఖిలపక్షాలతో సమావేశాలు జరిపిఉంటే వైయస్‌ఆర్‌సీపీ ముందుండేందన్నారు.చంద్రబాబు అనైతిక విధానాల వల్లనే వైయస్‌ఆర్‌సీపీ అఖిలపక్ష భేటికి  దూరంగా ఉందన్నారు.

 

Back to Top