ఏపీకి న్యాయం చేయాలి..

ప్రధానిని కోరిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

ఢిల్లీ: ఏపీకి న్యాయం చేయాలని ప్రధానిని  కోరడం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు. పలు అంశాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఆయన పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌  బిల్లుకు సంబంధించి వైయస్‌ఆర్‌సీపీ  పూర్తి  మద్దతుగా తెలుపుతుందని, మహిళలందరికి సమాన హక్కులు కల్పించాలన్నారు. రాజ్యాంగంలో 52వ  సవరణ నిష్ఫ్రయోజనం అయిపోయిందన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని, వారిలో నలుగురును మంత్రులను చేసి రాజ్యాంగాన్ని అపహస్యం పాలు చేసిందన్నారు.

చంద్రబాబు వైఖరిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనర్హత పిటిషన్‌పై కాలపరిమితి నిర్ణయించాలని కోరినట్లు తెలిపారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రైతులందరూ నిరాశ నిస్పృలతో ఉన్నారన్నారు. వారికి న్యాయం చేయాలని, వారి ఆదాయం రెండింతలు పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాడం జరిగిందన్నారు. ఉద్యోగాలు లేక యువత నిరాశకు లోనవుతున్నారని,నిరుద్యోగం కారణంగా యువత చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఉద్యోగవకాశాలు పెంపొందించే చర్యలు చేపట్టాలన్నారు. పారిశ్రామిక ,వ్యవసాయ,సేవా రంగాలను అభివృద్ధికి ప్రణాళికలు వేయాలని కోరామని, దీనికి వైయస్‌ఆర్‌సీపీ సహకారం ఉంటుందన్నారు.

 

Back to Top