‘యాత్ర’ బాబుకు చూపించాలి

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌

తెలుగు ప్రజలంతా తప్పక చూడాల్సిన సినిమా

విజయవాడ : ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే చంద్రబాబుకు దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా చూపించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైయ‌స్ఆర్‌ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు చక్కగా చూపించారని చెప్పారు. యువరాజ్‌ థియేటర్‌లో సినిమా చూసిన అనంతరం మాల్లాది విష్ణుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

వైయ‌స్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర విశేషాలను ప్రత్యేకంగా చూపించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుగు ప్రజలంతా తప్పక చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు.  ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని.. అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కారం కోసం అనుదినం పనిచేసిన మహానేత వైయ‌స్ఆర్‌ మార్గంలో మేమంతా పనిచేస్తాం’ అని మల్లాది విష్ణు అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడిలో ఆ పార్టీ నాయకుడు వీఆర్‌ ఎలీజా వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యలర్తలతో కలిసి ‘యాత్ర’  బెనిఫిట్ షోను వీక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాత్ర సినిమా చాలా బాగుందన్నారు. ప్రజల గుండెలకు హత్తుకునేలా సినిమా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడారు. పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సార్‌ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చూడదగిన సినిమాగా యాత్రను రూపొందించారని అన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top