చంద్రబాబు ప్రత్యేకహోదా ద్రోహి

ఎన్నికల ముందు అఖిలపక్షమా..?

వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌...

విజయవాడ: చంద్రబాబు ప్రత్యేకహోదా ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఎన్నికలకు మూడు నెలల ముందు అఖిలపక్షం సమావేశం నిర్వహించడం వల్లన లాభమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే అఖిలపక్షం పెట్టి.. ప్రతిపక్షం సలహాలు,సూచనలు తీసుకుంటే సముచితంగా ఉండేదన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని చంద్రబాబు నేడు ప్రత్యేకహోదా అంటూ నాటకాలు మొదలుపెట్టారన్నారని ధ్వజమెత్తారు. మొదట నుంచి ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే వారిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేయించి భయభ్రాంతులకు గురిచేశారన్నారు.

నేడు చంద్రబాబు అఖిలపక్షం అని చెప్పి మోసం చేయడం తప్ప.. దానిలో పారదర్శకత లేదన్నారు.చంద్రబాబు జిత్తులమారి నక్కలాగా కుయుక్తులు,పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. నలభై  ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు..నలభై ఏళ్ల యువకుడు వైయస్‌ జగన్‌ మొదటి నుంచి ప్రత్యేకహోదా కావాలని,రాష్ట్రానికి హోదా చాలా అవసరమని చెబుతున్నా..  పెడచెవిన పెట్టిన  చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు మొదలుపెట్టారన్నారు.  ప్రత్యేకహోదా ద్రోహిగా చంద్రబాబును అభివర్ణించారు.

గతంలో ప్రత్యేకహోదా సంజీవనా..ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు నేడు ప్రత్యేకహోదా కోసం మాట్లాడుతున్నాడంటే ఆ ఘనత అంతా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కిందన్నారు. వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధి, ముందుచూపే అని అన్నారు.రాష్ట్ర ప్రజలందరూ వైయస్‌ జగన్‌ వైపు చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి లేదన్నారు.

 

Back to Top