రాష్ట్రంలో 59 లక్షల బోగస్‌ ఓట్లు

వైయస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
 

చిత్తూరు: రాష్ట్రంలో 59 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సర్వేలతో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 11 నుంచి ఇప్పటి వరకు 14 లక్షల ఓట్లను తొలగించారన్నారు.

చంద్రబాబు తీరుతో రాజ్యాంగం అపహాస్యమవుతోందన్నారు. చంద్రబాబు బడ్జెట అంతా అంకెల గారడీనే అన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చి యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. పోస్టు డేటెడ్‌ చెక్కులిచ్చి మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల రుణమాఫీ కాలేదన్నారు. 
 

Back to Top