శ్రీకాకుళంలో టీడీపీ బరితెగింపు..

పోలీసు కానిస్టేబుళ్లలతో డబ్బులు పంపిణీ

రక్షకులే భక్షకులుగా మారుతున్నారు..

పోలీసుల తీరుపై వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం మండిపాటు

శ్రీకాకుళం: జిల్లాలోటీడీపీ ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తరపున డబ్బులు పంచుతూ  వజ్రపుకొత్తూరు కానిస్టేబుళ్లు మీడియాకు చిక్కారు. ఎన్నికల కమిషన్‌ నిఘా నుంచి తప్పించుకునేందుకు పోలీసులే టీడీపీ అభ్యర్థికి సాయం చేస్తున్న తీరు పట్ల ప్రజాస్వామ్యవాదులు,వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పోలీసులు టీడీపీకి సాయం చేస్తున్నారని ఇటీవలô  ఎన్నికల కమిషన్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేశారు. 

టీడీపీ బరితెగింపుకు పరాకాష్ఠ:వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం

ఎన్నికల్లో పోలీసు యంత్రాంగాన్ని డబ్బులు పంపిణీకీ  టీడీపీ  వాడుకోవడం  బరితెగింపుకు పరాకాష్ఠ అని వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. పోలీసులు టీడీపీ పార్టీకి తొత్తులుగా మారారని.. అనేక సార్లు ఎన్నికల కమిషన్‌కు,గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వ్యవస్థలో ఉన్న ప్రధాన అధిపతులను మార్చాలని తెలిపామన్నారు. తెలుగుదేశం పార్టీ సేవలో శ్రీకాకుళం పోలీసులు  నిమగ్నమయ్యారన్నారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారుతున్నారన్నారు.ఈ పరిస్థితి ఇలా కొనసాగితే పోలీసు యంత్రాంగంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు.

Back to Top