చంద్రబాబు ఢిల్లీ దీక్ష బూటకం..

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం..

అనంతపురం:సీఎం చంద్రబాబు..ఢిల్లీ దీక్ష బూటకమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు.ప్రజామోదం లేకుండా ప్యాకేజీకి ఒప్పుకుని క్షమించరాని తప్పు చేశారన్నారు.ప్రత్యేకహోదాకు ప్రధాన అడ్డంకి చంద్రబాబే అని అన్నారు.ఎన్డీయేలో ఉన్నప్పుడు చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తులేవన్నారు.రాజకీయ లబ్ధికోసం ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాధనంతో టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విమర్శించారు.ఎన్నికల భయంతో ఢిల్లీలో ఏపీ సీఎం ఒక రోజు దీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు.

Back to Top