చంద్రబాబు అబద్ధాల కోరు..

ఎన్నికల తరుణంలో మళ్లీ డ్రామాలు..

వైయస్‌ఆర్‌సీపీ నేత జంగాలపల్లి శ్రీనువాసులు..

 చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల కోరని..ఎన్నికలొస్తుండడంతో మళ్లీ డ్రామాలు మొదలెట్టారని వైయస్‌ఆర్‌సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు.చిత్తూరు రూరల్‌ మండలం ఆనగల్లు,ముత్తుకూరు పంచాయతీల్లో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.

వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్నివర్గాలకూ లబ్ధి చేకూరుతుందన్నారు. చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి పథకంతో మేలు జరుగుతుందన్నారు. ఐటిఐ,డిగ్రీ,బీటెక్‌ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు హాస్టల్‌ ఫీజు ఇస్తామన్నారు. రైతులకు ఏటా మే నెలలోనే ఉచితంగా రూ.12,500 పెట్టుబడి కోసం అందజేస్తామన్నారు. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తారన్నారు.ప్రతి పేదవాడికి స్థలం ఇస్తూ పక్కా ఇల్లు కట్టించి ఇస్తారని తెలిపారు. 

Back to Top