హోదా సాధ‌న‌కు ఎందాకైనా వైయ‌స్ జ‌గ‌న్ సిద్ధం

 వైయ‌స్ఆర్‌ సీపీ నంద్యాల సమన్వయ కర్త శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి 
 

క‌ర్నూలు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంత వరకైనా వెళ్తారని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల సమన్వయ కర్త శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చించేందుకు కేటీఆర్-  వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి కలవడాన్ని టీడీపీ నేతలు విమర్శించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిలా స్వప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు చేసే నీచ సంస్కృతి తమ పార్టీ అధ్యక్షుడికి లేదని పేర్కొన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు దృష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
మహిళల్లో చైతన్యం తీసుకువస్తాం
తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు మహిళా విభాగం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శశికళఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మహిళల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు.తమ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే.. టీడీపీ నేతలు షర్మిలపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. జగనన్న పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ చూసే టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటి చర్యలను మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 
 

Back to Top