పాలన చేతగాక నవరత్నాలు కాపీ 

చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మరు

మూడు నెలల్లో రాజన్న రాజ్యం వస్తుంది

వైయస్‌ఆర్‌ సీపీ నంద్యాల సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి

కర్నూలు: నాలుగున్నరేళ్లు చేసిందేమీ లేక  సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయనగా కొత్త కొత్త డ్రామాలతో ముందుకు వస్తున్నాడని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా అష్టకష్టాలు అనుభవించిన ప్రజలంతా నిన్ను నమ్మం బాబూ అంటున్నారని ఆయన చెప్పారు. నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను వివరిస్తున్నారు. నవరత్నాలతో ప్రతి ఇంటికి రూ. 5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని, వైయస్‌ఆర్‌ సీపీకి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ మేరకు రవిచంద్ర కిషోర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 

నవరత్నాలు వైయస్‌ జగన్‌ సంవత్సరన్నర క్రితమే ప్రకటించారని ప్రజలు గుర్తు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల వస్తున్నాయని హడావుడిగా డ్రామాలతో ముందుకు వస్తుంటే ప్రజలంతా అవాక్కవుతున్నారన్నారు. ఎన్నికల తరువాత హామీలను తుంగలో తొక్కుతారని ప్రజలే చెబుతున్నారు. ప్రజలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదిస్తే మూడు నెలల్లో రాజన్న రాజ్యం వస్తుందన్నారు. 

Back to Top