అరాచక పాలనను అంతమొందించాలి

సున్నిపెంట రావాలి జగన్‌.. కావాలి జగన్‌ 

శిల్పా చక్రపాణిరెడ్డి

శ్రీశైలం: తెలుగుదేశం పార్టీ అరాచక పాలనను అంతం మొందించాలని శ్రీశైలం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. సున్నిపెంటలో శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు ఒక్కటీ లేవన్నారు.

పూర్తిగా అవినీతితో నిండిన చంద్రబాబు సర్కార్‌ను ఇంటికే పరిమితం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. చెదలు పట్టిన రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్ర ద్వారా 13 జిల్లాల్లో పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదల కష్టాలు తెలుసుకున్నారని, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారన్నారు. 2019 ఎన్నికల్లో జననేత ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుపేదలు సంతోషంగా జీవిస్తారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే మెరుగ్గా పాలన చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీకి మద్దతుగా నిలిచి గెలిపించాలని, రాజన్న రాజ్యం మళ్లీ తెచ్చుకుందామని ప్రజలకు సూచించారు. 

 

Back to Top