గౌతమ్‌రెడ్డి  అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
 

హైదరాబాద్‌: మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గౌతమ్‌రెడ్డి అత్యంత సన్నిహితుడని గుర్తు చేశారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గౌతమ్‌రెడ్డి  మరణం ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని తెలిపారు. రేపు ఉదయం నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలిస్తామని చెప్పారు. ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సొంత సొదరుడిని కోల్పోయినంత బాధగా ఉంది: మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, సొంత సోదరుడుని కోల్పోయినంత బాధగా ఉందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. అయన అకాల మరణం తీరని లోటు అన్నారు.

తీవ్ర ఆవేదన కలిగించింది: మంత్రి సురేష్‌
గౌతమ్‌రెడ్డి అకాల మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని చెప్పారు. మాటల్లో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. పరిశ్రమల శాఖను గౌతమ్‌రెడ్డి సమర్థవంతంగానిర్వహించాలని కొనియాడారు. 
 

తాజా వీడియోలు

Back to Top