సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ యుద్ధం చేస్తుంటే.. ‌బాబు ర‌క్ష‌సుడిలా అడ్డు 

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న తీసుకెళ్ల‌డం విధ్వంస‌మా?

14 నెల‌లైనా చంద్ర‌బాబులో మార్పు రాలేదు

చంద్ర‌బాబు‌కు ప్ర‌జాస్వామిక విలువ‌ల‌పై గౌర‌వం లేదు

చంద్ర‌బాబు బాధంతా బినామీల కోస‌మే

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ యుద్ధం చేస్తుంటే..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ర‌క్ష‌సుడిలా అడ్డుత‌గులుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అభివ‌ర్ణించారు. దేశంలో చంద్ర‌బాబు లాంటి ప్ర‌తిప‌క్ష నేత ఎవ‌రూ ఉండ‌ర‌న్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మర్ధ‌వంతంగా ప‌ని చేస్తే చంద్ర‌బాబు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు. ఐదేళ్లు ఏ ఒక్క అభివృద్ధి ప‌ని చేయ‌ని చంద్ర‌బాబు..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే సంక్షేమాన్ని తీసుకెళ్తుంటే విధ్వంసం అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తి, సీఆర్‌డీఏ విష‌యాల్లో అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని, కోర్టుల‌ను ప్లాట్‌ఫామ్‌లుగా చేసుకొని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై అస్త్రాలు సంధిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా..

 • క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసింది 
 • వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు 
 • చంద్ర‌బాబు పాల‌న‌లో ఒక్క అభివృద్ధి ప‌ని కూడా జ‌ర‌గ‌లేదు
 • ఓడిపోయి 14 నెల‌లైనా చంద్ర‌బాబులో మార్పు రాలేదు
 • అధికారంలో ఉన్న ఐదేళ్లు చంద్ర‌బాబు త‌న స్వార్థం కోస‌మే ఆలోచించారు.
 • పొద్దున లేచింది మొద‌లు కోర్టుల‌ను ప్లాట్‌ఫామ్‌లుగా చేసుకొని ..వాటి నుంచి అస్త్రాలు సంధించ‌డం..లేదా ఇంత పెద్ద వ్య‌వ‌స్థ‌లో ఎక్క‌డో ఒక చిన్న త‌ప్పు జ‌రిగితే దాన్ని అండ‌ర్‌లైన్ చేసి 
 • భూతద్దంలో చూపిస్తున్నాడు. ఇవేవి లేక‌పోతే క‌ళ్లు  మూసుకొని క‌రోనా గురించి మాట్లాడుతున్నారు.
 • 14 నెల‌ల్లో రూ.53 వేల కోట్ల సంక్షేమం నేరుగా ప్ర‌జ‌ల‌కే అందింది. ఇంటి వ‌ద్ద‌కే సంక్షేమ ఫ‌లాలు అందిస్తున్నాం
 • చంద్ర‌బాబు విధ్వంస‌మం గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంది.  ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న తీసుకెళ్ల‌డం విధ్వంస‌మా?. అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డం విధ్వంస‌మా?
 • రూ.3 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై అప్పుల‌భారం పెట్టారు.
 • క‌రోనా క‌ష్ట‌కాలంలో చంద్ర‌బాబు ఎక్క‌డ దాక్కున్నారు.  పొరుగు రాష్ట్రంలో కూర్చొని జూమ్ కాన్ఫ‌రెన్సులు
 • చంద్ర‌బాబు, లోకేష్ ఎందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య తిర‌గ‌డం లేదు
 • డ‌బ్ల్యూహెచ్‌వో సూచ‌న‌ల మేర‌కు అధిక క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి దేశానికే క‌రోనా నియంత్ర‌ణ‌లో ఏపీ ఆద‌ర్శంగా నిలిచింది.
 • ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం
 • ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ యుద్ధం చేస్తుంటే..చంద్ర‌బాబు ర‌క్ష‌సుడిలా అడ్డుప‌డుతున్నాడు.
 • స‌రిహ‌ద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా  వైద్యులు ఎక్కువ ఒత్తిడితో  క‌రోనా నియంత్ర‌ణ‌కు క‌ష్ట‌ప‌డుతున్నారు. వైద్యులు, న‌ర్సులు, పారిశుద్ధ్య కార్మికుల సేవ‌లు అమోఘం. అనిర్వ‌చ‌నీయం.
 • క‌రోనా నియంత్ర‌ణ‌కు చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంటే..కంటి ద్వారా, పంటి ద్వారా క‌రోనా వ‌స్తుంద‌ని ఎవ‌రో రాస్తే..దాన్ని ప‌ట్టుకొని చంద్ర‌బాబు శ‌వాల మీద పేలాలు ఏరుకుంటారు. బ‌హుశ ఇలాంటి ప్ర‌తిప‌క్షం దేశంలో ఎవ‌రు చూసి ఉండ‌రు.
 • చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌కు ప్ర‌జాస్వామిక విలువ‌ల‌పై గౌర‌వం ఉండ‌దు.
 • సీఆర్‌డీఏ, రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం 250 రోజులు ఉద్య‌మం చేశార‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. మ‌న బాధ ఊరి బాధ అనుకునే వారు కొంద‌రైతే..ఊరి బాధ మ‌న బాధ అనుకునే వారు మ‌రి కొంద‌రు. మ‌న బాధ‌ను ఊరి బాధ‌గా చేసే వారిలో చంద్ర‌బాబు మొద‌టి వ్య‌క్తి. ఈయ‌న‌కు మీడియా బ‌లం ఉండ‌టంతో త‌న బాధ‌ను ఊరి బాధ‌గా చిత్రీక‌రించి అప్పుడ‌ప్పుడు స‌ఫ‌లీకృత‌మ‌వుతున్నాడు.
 • చంద్ర‌బాబు బాధంతా సీఆర్‌డీఏ ప‌రిధిలో ఉన్న త‌న బినామీల భూముల‌కు విలువ త‌గ్గింద‌ని, దాన్ని రాష్ట్ర స‌మ‌స్య‌గా చిత్రీక‌రించాల‌ని త‌ప‌న ప‌డుతున్నారు
 • సీఆర్‌డీఏ ప‌రిధిలో 2019 న‌వంబ‌ర్ నాటికి  28.526 మంది రైతులు రాజ‌ధానికి భూములు ఇచ్చార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. అక్క‌డ 34, 385 ఎకరాల భూమి ఉంది.  ఇందులో ప‌ట్టా భూమి 30, 913 ఎక‌రాలు, అసైన్డ్ ల్యాండ్ 2,671 ఎక‌రాలు . ఈ అసైన్డ్ భూముల‌న్నీ ఏం చేశారో ప్ర‌పంచంలో అంద‌రికీ తెలుసు.
 •  వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక అసైన్డ్ భూముల‌న్ని అనుభ‌వంలో ఉన్న‌వారికే చెందుతాయ‌ని, వేరే వ్య‌క్తుల‌కు చెల్ల‌వ‌ని ఓ చ‌ట్టం చేశారు. 
 • ఒక ఎక‌రా లోప‌ల ఉండే రైతులు 19,970 మంది ఉన్నారు. రైతులెవ‌రికి ఈ ప్ర‌భుత్వం అన్యాయం చేయ‌ద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వివ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top