రాజకీయ కార్యక్రమాలు వద్దు..సేవా కార్యక్రమాలు చేపట్టండి

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల పిలుపు 
 

తాడేపల్లి: వైయస్‌ఆర్‌సీపీ విజయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో మార్పు చేశారు. రాజకీయ కార్యక్రమాలు వద్దు..సేవా కార్యక్రమాలు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏడాది పూర్తి అవుతుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలని ఆయన సూచించారు. సేవా సంస్థలు, వాలంటీర్ల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 
 

Back to Top