చంద్రబాబు డ్రామాలు ప్రజలు నమ్మొద్దు

బీజేపీ,టీడీపీల మధ్య బంధంపై అనుమానాలు

సీఎంగా ఉండేందుకు చంద్రబాబు అర్హత కోల్పోయారు

టీడీపీ ఓటర్లను ప్రలోభపెడుతుంది

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు పాలనలో ప్రజల బతుకులు అధ్వాన్నంగా మారాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.సీఎం ఉండేందుకు చంద్రబాబు అర్హత కోల్పోయారన్నారు.ఆయన హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి మేలు  చేయడానికి వైయస్‌ జగన్‌ స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్తున్నారన్నారు.గతంలో వైయస్‌ఆర్‌ ప్రజలు ఇచ్చిన హామీలన్ని అమలు చేసి..అభివృద్ధి చూపించి ఓటు అడిగారని గుర్తుచేశారు.చంద్రబాబు ఈ ఐదేళ్లల్లో ప్రజలకు ఏంచేశారని ప్రశ్నించారు.ప్రజలు ఐదేళ్ల పాటు పరిపాలించడానికి చంద్రబాబుకు అవకాశం ఇచ్చారని,కాని ఏచేశావు అని ప్రశ్నించారు.ఓట్ల తొలగింపు,దొంగ  ఓట్లపై ఈసీ దృష్టికి వైయస్‌ఆర్‌సీపీ ఆధారాలతో తీసుకెళ్ళిందన్నారు. మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఆధారాలతో చూపించామని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బీజేపీ,టీడీపీల మధ్య సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎలక్షన్‌ తర్వాత మా వద్దకు వస్తారనే అమిత్‌షా వ్యాఖ్యలు బట్టి అర్థ«మవుతుందన్నారు.రహస్య బంధం కొనసాగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు.ఎన్నికలకు రెండు రోజుల ముందు డ్వాక్రా ఖాతాల్లో డబ్బు వేయడం నేరమన్నారు. 8వ తేదీ డబ్బులు వస్తాయని బహిరంగంగా చెబుతున్నారన్నారు. ఈ విషయంలో మహిళలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని వదిలేశామన్నారు.చంద్రబాబు, కేఎల్‌ పాల్‌ కుమ్మక్కె మా అభ్యర్థుల పేర్లున్న అభ్యర్థుల పేరులతో బరిలో పెడుతున్నారు.మా పార్టీకి పొలిన కండువాలే కప్పకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈసీ గాని,కేంద్రం గాని ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.లాలూచీ లేకపోతే చంద్రబాబు ఎందుకు ఫేవర్‌ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఇన్‌కం టాక్స్‌ దాడులు జరిగితే..సీఎం రమేష్‌ ఐటి అధికారులు దబాయించారని,నిజంగా ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులయితే చేతులు కట్టుకుని నిలబడతారా..వారు డ్రామా ఆరిస్టులయినా  అయి ఉండాలి. .వారి చెప్పు చేతలోవారైనా ఉండాలన్నారు.పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వలేదన్నారు.  టీడీపీ ఓటర్లను ప్రలోభ పెడుతుంది.ప్రజలందరూ గమనించాలన్నారు.ఎంతోకొంత డబ్బు ఇస్తే ఓట్లు పడతాయని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు.కడుపుమాడ్చి..చివరికి పచ్చడి మెతుకులు పెడుతున్నారన్నారు.ప్రజలకు పంచడానికి చంద్రబాబు.. పోలీసుల వాహనాల ద్వారా ప్రతి నియోజవర్గానికి డబ్బులు పంపిస్తున్నారన్నారు.ప్రజలకు ఏమీ చేయాల్లో వైయస్‌ జగన్‌కు స్పష్టత ఉందన్నారు.పాదయాత్ర ద్వారా ప్రజలు సమస్యలు తెలుసుకుని బ్లూప్రింట్‌ తయారుచేసుకున్నారని,ప్రజలందరికి మేలు చేస్తారని తెలిపారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మొద్దన్నారు.

 

 

Back to Top