17న బీసీ గ‌ర్జ‌న విజ‌య‌వంతం చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

తిరుప‌తిలో రాయ‌ల‌సీమ రీజియ‌న్ స‌న్మాహ‌క స‌మావేశం

బీసీలు అభివృద్ధి చెంద‌కుండా బాబు అడుగ‌డుగునా అడ్డంకులు

తిరుప‌తి: ఈ నెల 17న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న బీసీ గ‌ర్జ‌న మ‌హాస‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తిరుప‌తిలోని పార్టీ  కార్యాలయంలో శుక్ర‌వారం బీసీ గర్జనపై రాయ‌ల‌సీమ రీజియన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ   రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు రాజకీయంగా...ఆర్థికంగా...సామాజికంగా అభివృద్ధి చెందకుండా చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిప‌డ్డారు.

బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో బీసీ గర్జనను నిర్వహించి వారి సంక్షేమం కోసం డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు.  బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న టీడీపీ ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన ఒక్క హామీ కూడానెరవేర్చలేదన్నారు. చంద్రబాబు అనేక వాగ్దానాలు చేసి అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీల సమస్యలను అధ్యయనం చేయడం కోసం వైయ‌స్ఆర్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ వర్గాలను కలిసి వారి సమస్యలపై అధ్యయనం చేసిందన్నారు. రాబోయే కాలంలో  వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చాక బీసీల జీవనప్రమాణాలు పెంచేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో పేర్కొంటూ నివేదిక అంద చేసిందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని బీసీ డిక్లరేషన్‌ను ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించే బీసీ గర్జనలో వైయ‌స్ జగన్ ప్రకటిస్తారని చెప్పారు. ఈ గర్జన సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.   

Back to Top