ప్రజలే వైయస్‌ జగన్‌కు ఆక్సిజన్‌ 

శనిలా పట్టిన టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తాం

అప్పటి వరకు యుద్ధం కొనసాగుతోంది

వ్యవసాయానికి ఊపిరి పోసేలా జననేత హామీలు

వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తిరుమల: ఇడుపులపాయలో 2017 నవంబర్‌ 6న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దేశ చరిత్రలోనే అద్బుతమైనదని వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటిన్నర మందికిపైగా ప్రజలను వైయస్‌ జగన్‌ పాదయాత్రలో కలిశారన్నారు. ఇలాంటి సాహసం ఏ నాయకుడు చేయరు. చేయలేరన్నారు. కష్టం అంటే తెలియని కుటుంబంలో పుట్టిన నాయకుడు ప్రజల కోసం పాదయాత్ర చేసి ప్రజానాయకుడిగా ఎదిగారు. దాని ముగింపు సందర్భంగా దేవుడి ఆశీస్సుల కోసం, రాష్ట్రం కష్టాల నుంచి బయటపడాలని, ఐదు కోట్ల ప్రజలు శ్రేయస్సు కోరేందుకు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడలే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పునాదులు, మార్గదర్శకాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు చేరువగా పాలన ఉండాలనేది వైయస్‌ జగన్‌ లక్ష్యం. అందుకే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 10 మందికి ఉద్యోగాలు, 72 గంటల్లో సమస్యలు పరిష్కరించే విధంగా పాలన చేస్తారన్నారు. స్పష్టమైన ప్రణాళికతో ఐదేళ్ల పాలనలోనే దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా చేయగలరు. ప్రజలే వైయస్‌ జగన్‌కు ఆక్సిజన్‌ అని సజ్జల అన్నారు. 

ప్రతిపక్షం ఎప్పుడైనా అధికార పక్షాన్ని విమర్శిస్తుందని, కానీ ఆంధ్రరాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంపైనే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దున్నపోతుమీద వర్షం పడినట్లుగా మీడియాను అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోటి మందికిపైగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి వైయస్‌ జగన్‌ను కలవడానికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకం, వైయస్‌ జగన్‌పై ప్రేమ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 

రైతులే ఆంధ్రరాష్ట్రానికి పునాది అని సజ్జల అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు రైతులను చిన్నచూపు చూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దిగజార్చిన వ్యవసాయానికి ఊపిరి పోసేందుకు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండుగలా చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా తిరుగుతారని, బూత్‌ కమిటీలతో సహా పార్టీ పటిష్టంగా ఉంది. గడప గడపకూ కార్యక్రమం ద్వారా నాయకులు, కార్యకర్తలు ప్రజలకు నాలుగున్నరేళ్ల రాక్షస పాలనను వివరిస్తున్నారు. నిన్ను నమ్మం బాబూ అనే కొత్త కార్యక్రమం కూడా చేపట్టామన్నారు. రాష్ట్రానికి శనిలా పట్టిన తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసేంత వరకు యుద్ధం కొనసాగుతోందన్నారు. 

Back to Top