అఖిలపక్షం పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా...

రాజధాని నిర్మాణం,పేరు విషయంలో విపక్షాన్ని పిలిచారా..?

నేడు విపక్షాలు హాజరుకాలేదని ఎందుకంతా గగ్గొలు..

వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నాని...

విజయవాడ:అఖిలపక్షం పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా ఆడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నాని ధ్వజమెత్తారు.విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజలు వెలివేస్తారనే భయంతో చంద్రబాబు అఖిలపక్షం అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం విషయంలో ఎప్పుడైనా అఖిలపక్షాన్ని పిలిచారా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా ఒకసారి కూడా అఖిలపక్షం పెట్టని చంద్రబాబు..ఎన్నికల ముందు హడావుడిగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానికి విపక్షాలు హాజరుకాలేదని విపరీత పోకడలతో గగ్గొలు పెడుతున్నారన్నారు. ఏపీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అర్హత చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా అని సూటిగా ప్రశ్నించారు.2014లో బొటాబొటిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారన్నారు. అ«ధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజధానిని ఎక్కడ ఖారారు చేయాలనే విషయంలో విపక్షాలను పిలిచారా అనిప్రశ్నించారు.

రాజధానిని ఎక్కడ నిర్మిస్తే సముచితంగా ఉంటుందనే సలహాలు,సూచనలు అడిగారా అని ప్రశ్నించారు. చంద్రబాబు,ఆయన  వంది మాగదులు కలిసి భూములను కొనుగోలు చేసి వ్యాపారం చేసుకున్నారన్నారు. అమరావతి పేరు పెట్టే విషయంలో కూడా విపక్షాన్ని అడగలేదన్నారు. రాష్ట్ర రాజధాని నిర్ణయించేటప్పుడు చంద్రబాబుకు అఖిలపక్షంతో పనిలేదని, రాజధానికి పేరు విషయంలో కూడా చంద్రబాబుకు అఖిలపక్షంతో పనిలేదని దుయ్యబటారు. అప్పుడు కనీసం అఖిలపక్షం వేయడానికి చంద్రబాబుకు తీరికలేదన్నారు. రాజధాని శంకుస్థాపన చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చారు. అప్పుడైనా రాష్ట్ర అవసరాలు ఏమిటి, కేంద్రప్రభుతాన్ని  ఏమి అడుగుదాం అనే విషయంలో అఖిలపక్షం వేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా  కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ఆనాడు అఖిలపక్షాన్ని పిలిచారా అని ప్రశ్నించారు.

ఆ రోజు చంద్రబాబుకు ఆఖిలపక్షం గుర్తుకు రాలేదన్నారు. చంద్రబాబు,మోదీ లాలూచీ పడి వారి అవసరాలు,రాజకీయాలు కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీశారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నారు.సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి  వైయస్‌ జగన్‌పై కుట్రలు పన్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారనే విషయం ఏపీ ప్రజలు మరిచిపోలేదన్నారు. చట్టవ్యతిరేకంగా వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపైకి ఏపీ పోలీసులను పంపించి వైయస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయించిన చంద్రబాబు లాంటి దివాళాకోరు రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరూ ఉండరన్నారు. టీడీపీ,బీజేపీ పార్టీలు ఏపీ ప్రజలను వంచించిన పార్టీలన్ని, ఈ రెండు పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపినా.. వాటితో కలిసి పనిచేయడానికి వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకమన్నారు.

Back to Top