చంద్రబాబు ట్రాప్‌లో వంగవీటి రాధా...

 
రంగా విగ్రహవిష్కరణకు వెళొద్దని జగన్‌ ఎప్పుడూ చెప్పలేదు..

వైయస్‌ఆర్‌సీపీ నేత  పేర్నినాని

విజయవాడ: చంద్రబాబు ట్రాప్‌లో వంగవీటి రాధా పడటం బాధాకరమని వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నాని అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇళ్లు మంజూరుచేయడమే వంగవీటి రంగా ఆశయం కాదని ప్రతి పేదవాడికి కష్టంలో అండగా ఉండటమే రంగా ఆశయమన్నారు. అధికారం అంతమయేరోజుల్లో పేదలకు చంద్రబాబు ఇళ్లు ఇస్తారని రాధా నమ్మడం వంగవీటి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సింహం కడుపున పుట్టిన వంగవీటి రాధా.. నరరూప ఆలోచనలు కలిగిన  చంద్రబాబు ట్రంప్‌లో చిక్కుకోవడం నక్కకు కుదేలు దొరికిన విధంగా ఉందన్నారు.

వంగవీటి రంగా నూటికి నూరుపాళ్లు రాజకీయాలకు అతీతుడని,  ఆయన యశస్సు రాజకీయాల కంటే ఉన్నతమైందన్నారు. వంగవంటి రాధకు రంగా విగ్రహవిష్కరణకు వెళ్లడానికి ఏరోజు  వైయస్‌ జగన్‌ అడ్డుచెప్పలేదన్నారు.ఎక్కడకు వెళ్ళినా పార్టీ కేడర్‌ను కలవమని మాత్రమే చెప్పారన్నారు.వంగవీటి రాధాకు వైయస్‌ఆర్‌సీపీ సముచిత స్థానం ఇచ్చిందన్నారు. వైయస్‌ జగన్‌పై వంగవీటి వ్యాఖ్యలు సత్యదూరమన్నారు.  చంద్రబాబుది దుర్మార్గ పాలన అని,మానవత్వంలేని పాలన అని వైయస్‌ జగన్‌ చెబుతారన్నారు. సర్పంచ్‌ దగ్గర నుంచి ఎంపీల వరుకు తనకు గిట్టకపోతే చంద్రబాబు విలువ ఇవ్వడని, కనీసం రేషన్‌కార్డు కూడా  ఇప్పించడని చెబుతారని, ఎమ్మెల్యేగా కంటే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ద్వారా  ప్రజలకు మేలు చేయవచ్చని వైయస్‌ జగన్‌ చెబుతుంటారు తప్ప ఎప్పుడూ  సర్వం నేనే అని ఎప్పుడు చెప్పలేదన్నారు.

రంగా హత్యకు,టీడీపీకి సంబంధంలేదని, ఆరోజు ఆవేశంగా మాట్లాడనని రంగా వ్యాఖ్యనించడం లక్షలాది రంగా అభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు. వంగవీటి రాధా ఆ స్థాయిలో మాట్లాడటం మనసు కలచివేసిందన్నారు. వంగవీటి రంగాను టీడీపీయే హత్యా చేయించిందని రాష్ట్రంలో మారుమూల గ్రామాల ప్రజలకు కూడా తెలుసు అన్నారు. తెలుగుదేశం గుండాలు  హత్యచేశారని రంగా అభిమానులు పాటలు కూడా పాడారని గుర్తుచేశారు. పార్టీలో విలువ ఇవ్వలేదని రాధా మాట్లాడటం అవాస్తమన్నారు. రాధా నో  అని చెప్పడంతోనే దేవిన్రెహుని వైయస్‌ఆర్‌సీపీలోకి చేర్చుకోలేదని చెప్పడానికి  వైయస్‌ఆర్‌సీపీ నాయకులంతా ప్రత్యక్షసాక్షులమన్నారు. రాధాని నొప్పించకూడదనే విలువ నిచ్చామన్నారు. వంగవీటి రాధ చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దని, రంగా ఆశయాలను నెరవేరుస్తారనే అమాయక స్థితిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. మంచి నిర్ణయం తీసుకోవాలని వంగవీటి రాధను,అనుచరులను కోరారు. వంగవీటి రాధాకు ఎక్కడ ఉన్నా మంచి భవిష్యత్‌ ఉండాలన్నారు.

Back to Top