ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఎవరు బాబూ?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసు

అధికారులను బెదిరించి ఎన్నికలకు వాడుకున్నారు

టీడీపీ కోసమే చిత్తూరు ఎస్పీ పని చేశారు

చంద్రబాబు సొంత తమ్ముడు, చెల్లెల్ని పట్టించుకోలేదు. 

చంద్రబాబు చెప్పేది ఒకటి..చేసేదొకటి

నా మీద పెద్ద కుట్ర చేశారు

తిరుపతి:  రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఎవరని ముఖ్యమంత్రి చంద్రబాబును వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అధికార బలంతో పోలీసు వ్యవస్థను వాడుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో అనేక చోట్ల టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో పెద్దిరెడ్డి మాట్లాడారు.  చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు అందరికి తెలుసు. నాన్‌ పోకల్‌ పోర్స్‌ పెట్టి ఎన్నికలు నిర్వహించారు. ఒక ఇన్‌స్పెక్టరే డబ్బులు పంపిణీ చేశారు. మేం ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చిత్తూరు ఎస్పీ టీడీపీ కోసమే పని చేశారు. ఈ విషయాలను కూడా ఎన్నికల కమిషనర్‌ గోపాలకృష్ణాకు ఫిర్యాదు చేశాం. ఒక సామాజిక వర్గానికి చెందిన వారినే చంద్రబాబు నియమించుకొని వైయస్‌ఆర్‌సీపీకి నష్టం కలిగేలా పని చేశారు. పెద్ద కొడుకు, పెద్దన్న అంటున్న చంద్రబాబు..తన సొంత కుటుంబాన్నే పట్టించుకోలేదు. వాళ్ల అమ్మ పేరు మీద ఉన్న ఆస్తిని కొడుకు లోకేష్‌పై మార్చుకున్నారు. గత ఎన్నికల్లో 600 హమీలు ఇచ్చి అన్నీ కూడా మర్చిపోయారు. పసుపు–కుంకుమతో మహిళలు ఎక్కువగా పోలింగ్‌కు వచ్చారని చెబుతున్నారు. వారి వడ్డీలకే ప్రభుత్వం ఇచ్చింది సరిపోదు. 

వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు ఎన్నిలకు ముందు కాపీ కొట్టారు. పింఛన్లు రూ.2 వేలు పెంచారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ అంటూ కాపీ కొట్టారు. నాపై పెద్ద కుట్ర చేశారు. ఎన్నికలకు ముందు కేవలం సబ్సిడీ డబ్బులు మాత్రమే నా నియోజకవర్గంలో విడుదల చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సబ్సిడీలు విడుదల చేశారు. మైక్రో  ఇరిగేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 5,500 కుటుంబాలకు గాను రూ.32 కోట్ల సబ్సిడీ విడుదల చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి జిల్లాలో కూడా ఇలాగే జరిగింది. ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష రుపాయాలు ఇస్తే మాకు ఓట్లు వేస్తారా? ఇది కుట్ర కాదా?. పోలింగ్‌ ముగిసే వరకు అన్ని  డ్రామాలు చేసి ఓటమి భయంతో ధర్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ టీడీపీ 130 సీట్లు అంటున్నారు. మరోవైపు ధర్నాలు అంటూ డ్రామాలు చేస్తున్నారు. మా నియోజకవర్గంలోని కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారు. పూతలపట్టులో ఎమ్మెల్యే అభ్యర్థిని కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డారు. రాయలసీమలో చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని పోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
 

Back to Top