బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ

ఓట్ల కోసం మరో పన్నాగం..

ఎన్నికలు ముందు బీసీలు గుర్తుకొచ్చారా..?

వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.వైయస్‌ జగన్‌ రూపొందించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. మొన్న పెన్షన్లు,నిన్న రైతు భరోసా, ఇప్పుడు కులాల వారీగా కార్పొరేషన్లు ఎన్నికల ముందు కాపీ కొట్టడం మొదలుపెట్టారన్నారు.

బీసీలపై చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్లుగా ఎందుకు మేలు చేయలేదని ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్‌ కింద నిధులు ఎందుకు మంజూరు చేయలేదో సమాధానం చెప్పాన్నారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబుకు బీసీలు గుర్తుకొచ్చారన్నారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి అమలుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఓట్ల కోసం చంద్రబాబు మరో పన్నాగం పన్నారన్నారు.ఎన్నికలు సమీపించిన తరుణంలో చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు.చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించాలన్నారు.

Back to Top