ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు

వివేకా హత్యపై లోకేష్‌ వ్యాఖ్యలు సంస్కారహీనం

మళ్లీ సీఎం అవుతాననే భ్రమలో చంద్రబాబు ఉన్నారు

రాబోయేది  రాజన్న రాజ్యం

వైయస్‌ఆర్‌సీసీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి

విజయవాడ: ఓటమి తప్పదనే భయంతో చంద్రబాబు,లోకేష్‌లు  దిగజారి మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్‌ నేత, అజాత శత్రువు వైయస్‌ వివేకానందరెడ్డి మరణంతో మేమంతా బాధతో ఉంటô  లోకేష్‌ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వివేకా మృతి తెలిసి పరవశించానని మాట్లాడటం దారుణమన్నారు. లోకేష్‌ ఎంత కిరాతంగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది.నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు కూడా ఎవరికైనా ఆపద వస్తే తన ఆపదగా భావించాల్సిందిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పెట్టిన ప్రెస్‌మీట్‌లో ముసిముసి నవ్వులు ఆపుకుంటూ..తమ విజయానికి అవకాశం లభించిందనే భ్రమలో ఉండి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

మనకు పరిచయం లేని వ్యక్తి చనిపోతే విచార వ్యక్తం చేస్తాం.మానవత్వం ఉన్న ఎవరుకూడా సంతోష వ్యక్తం చేయరు.కాని నలభై సంవత్సరాల  ప్రజా జీవితంలో చంద్రబాబుకు వైయస్‌ వివేకానంద రెడ్డి కుటుంబంతో చాలా సంబంధాలు ఉండి ఉంటాయన్నారు.ఆయన మృతి పట్ల  సానుభూతి వ్యక్తం చేయాల్సిన చంద్రబాబు ముసిముసి  నవ్వులు నవ్వుకుంటూ..తమ ఒక ఆయుధం లభించినట్లు.. ఆ ఆయుధం ద్వారా మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాననే భావం చంద్రబాబులో ఉందన్నారు. ఎంతసేపు తన బాధ్యత  నుంచి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఏవిధంగా వైయస్‌ జగన్‌ను ఇరికించాలో ఆలోచనలు చేస్తున్నారన్నారు.

వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు  నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.హత్యను జగన్‌మోహన్‌రెడ్డి చేయించినట్లు చంద్రబాబు ప్రచారం చేయడం దారుణమన్నారు.చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి ఈ భూమి మీద  ఉండరన్నారు.ౖ వెయస్‌ జగన్‌ అరాచకం సృష్టిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిజంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అరాచకం సృష్టించే  మనస్తత్వం ఉంటే ఆయనకు అత్యంత ప్రియౖయెన చినాన్న హత్యకు గురయినా కూడా.. ఎటువంటి ఉద్వేగానికి లోనుకాకుండా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు ఏమి సందేశం ఇచ్చారో ఒకసారి ఆలోచించాలన్నారు.శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలనిమాత్రమే తెలిపారన్నారు.రాబోయేది  రాజన్న రాజ్యమని వైయస్‌ఆర్‌సీపీ పథకాల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

 

Back to Top