రాజకీయ సన్యాసానికి సిద్ధమా చంద్రబాబూ..!

ఆధారాలు లేకుండా దిగజారుడు రాజకీయాలా..

ఓటమి భయంతోనే అసత్య ప్రచారాలు

సీఎం స్థాయిలో ఉండి.. గల్లి లీడర్‌ వ్యాఖ్యలా..

చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేత  పార్థసారధి ఫైర్‌

విజయవాడ: ఎలాంటి ఆధారాలు లేకుండా వైయస్‌ జగన్‌కు భూమి ఉందంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత కొలుసు ప్రార్థసారధి మండిపడ్డారు. విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం మీద లేనిపోని అబాండాలు వేస్తూ బురదచల్లుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దాదాపు ఐదు,ఆరు వందల కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని రిజిస్టర్‌ చేశారని చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి  ఆ భూమితో సంబంధం లేదు అంటô  రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అంటూ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. కనీసం ఆ భూమి ఎక్కడ ఉందో కూడా వైయస్‌  జగన్‌కు తెలియదన్నారు. కేవలం బురద చల్లడం కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతో చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ భూమి ఎక్కడుందో వెతికి చూపించాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు చెప్పింది అబద్ధం అయితే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని డిమాండ్‌ చేశారు. 24 గంటలో తేల్చిచెప్పాలన్నారు ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలో ఉన్న రాజకీయ పక్షం తన విజయాలు చెప్పుకుని తన పరిపాలన మూలంగా  రాష్ట్రం ఏవి«ధంగా అభివృద్ధి జరిగింది. ఏవిధంగా మేలు జరిగిందని చెప్పుకుని ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వెళ్తారని, చంద్రబాబు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ తన పార్టీలో దొంగలను కాపాడుతూ మీడియా సపోర్టుతో చంద్రబాబు బతుకు తున్నాడని మండిపడ్డారు. ఈడి,సిబిఐ అనే సంస్థలను చంద్రబాబు తన జేబు సంస్థలుగా భావిస్తున్నారని, ఈడి, సిబిఐకి మధ్య ప్రత్యుత్తరాల కాపీని చంద్రబాబు ఏవిధంగా సంపాదించాడో సమాధానం చెప్పాలన్నారు.

వ్యవస్థల్లో తన మనుషులను జొప్పించి  కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, ఏవిధంగా ఇష్టంలేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడో స్పష్టమవుతుందన్నారు. లెటర్‌ కాపీ ఏవిధంగా వచ్చిందో విచారణ జరిపించాలన్నారు. అధికారులు చంద్రబాబు ప్రోదల్భంతోనే ఉత్తరం రాశారా..అనేది తెలియాలన్నారు. 2017లో రాసిన లెటర్‌ను చంద్రబాబు బయటపెట్టారంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉండి చంద్రబాబు ఒరగబెట్టింది ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు రాష్ట్రం మేలు కోసం కాకుండా కేవలం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి,కేసుల్లో ఇరిక్కించే ప్రయత్నం చేశారే తప్ప..ప్రత్యేకహోదా, విభజన చట్టంలో హామీలు తీసుకురావడానికి కాని ప్రయత్నం చేయలేదని స్పష్టమవుతోందన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం గల్లి లీడర్‌ కూడా మాట్లాడని విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మోసగాళ్లందరూ చంద్రబాబు పక్కనే ఉన్నారని తెలిపారు.తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కేసుల్లో ఉండటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో తెలియడానికి రాయపాటి సాంబశివరావు చంద్రబాబును బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని, తీసుకున్న ముడుపులు బయట పెడతానని భయ పెట్టించుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు.చంద్రబాబు,ఆయన పార్టీ నాయకులు ఏవిధంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు.ఐటిదాడుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సీఎం రమేష్,గంటా శ్రీనివాసరావు వంటి వారు దొరికిపోలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏమి చెప్పుకోవాల్లో అర్థంకాక,ఐదు సంవత్సరాల్లో టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమిలేకపోవడంతో చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేయడానికి పూనుకున్నారన్నారు. 

చంద్రబాబు కులవివక్షతను కూడా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని దయ్యబట్టారు. తిరుపతిలో ప్రవేశానికి సంబంధించి ఒక జీవో జారీ చేశారని, మోదీ మీద కోపం,బ్రాహ్మణ సంఘం అంతా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సపోర్టు చేస్తుందనే కోపంతో పీఠాధిపతులకు,స్వామిజీలకు కూడా ప్రవేశం లేకుండా చేశారన్నారు. అబద్ధాల ప్రచారాలు మాని తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే నేరుగా పరిపాలననే ఆధారంగా చేసుకుని ఎన్నికలకు రావాలన్నారు. చంద్రబాబు ఏం చెప్పితే అది పెద్ద వ్యాసాలు రాసే మీడియా సపోర్టు ఉంది కాబట్టి  ప్రజల్లోకి వెళ్ళి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.చంద్రబాబుకు దమ్ముంటే సాక్ష్యాలు,జీవోలతో సహా వైయస్‌ఆర్‌సీపీ వేసిన అవినీతి చక్రవర్తి పుస్తకంలో పొందుపర్చిన అవినీతిపై సీబీబి,సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించుకుని నిజాయతీ పరుణ్నిగా బయటకు రావాలన్నారు.

Back to Top