ఊసరవెల్లి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు..

ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు డ్రామాలాడుతున్నారు.

చంద్రబాబుది మోసపూరిత ప్రభుత్వం...

ఎన్నికలకు రెండు నెలల ముందు రైతులకు పండగ చేస్తావా..

వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి..

హైదరాబాద్‌: రైతులను నిలువునా దగా చేసిన చంద్రబాబు.. ఎన్నికలకు రెండునెలలు ముందు రైతులకు పండగ అని  చెప్పి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి మండిపడ్డారు. హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.నాలుగేళ్లు పాటు రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదని... కనీసం ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధికి 5వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు.. రైతులు పండించిన « ధాన్యానికి గిట్టుబాటు కల్పించలేదని దుయ్యబట్టారు. గత సంవత్సరాలతో  పోల్చితే మినుములు ధర 40 శాతానికి పడిపోయిందన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా ధరల స్థిరీకరణ నిధుల నుంచి కేటాయించలేదని ధ్వజమెత్తారు.పసుపు,మిర్చి  ధరలు పడిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కూడా చంద్రబాబు స్పందించలేదని మండిపడ్డారు. 5 వేల కోట్లలో కనీసం 100 కోట్లు కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. నేడు రైతులకు పండగ చేస్తామని చంద్రబాబు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు.

రైతులను ఆదుకోకపోగా..న్యాయమైన ధరల కోసం రైతులు పోరాడితే వారిని అరెస్ట్‌ చేయించి.. కించపరిచే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.  ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది రైతులే అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చంద్రబాబు పెద్ద డ్రామాలు ఆడతారని దుయ్యబట్టారు. తుపాన్లు వచ్చే సమయాల్లో రాష్ట్రంలోని ప్రజలను భయా కంపితులను చేస్తారని, సమస్యని పరిష్కరించాల్సిన నాయకులు..పరిపాలనను గాలికొదిలి కాంపెయిన్లు చేస్తారని విమర్శించారు. చంద్రబాబు లక్షల కోట్ల నష్టం అని చెప్పి నానాయాగీ చేస్తారన్నారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆరు,ఏడు వందల కోట్లో కేటాయిస్తారని, కేటాయించిన పదిరోజులకు హూదుద్‌ తుపానును బ్రహ్మాండంగా మేనేజ్‌ చేశాను.. సమస్యను అంతా నిముషాల్లో పరిష్కరించాను అని చెప్పి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారని ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు మంత్రులు,ఎమ్మెల్యేలు తానతందాన అంటూ వంతా పాడతారని తెలిపారు. తిత్లీ తుపానులో రైతాంగం దాదాపు 3,600 కోట్లు నష్టపోయిందని చెప్పి ప్రభుత్వమే అంచనా వేసిందని.. కేంద్ర ప్రభుత్వం  కేవలం ఆరు వందల కోట్లు ఇస్తే...మిగతా డబ్బులు వేసి రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వం..ఒక రూపాయి కూడా చెల్లించకుండా..మోదీనో,బీజేపీనో తిడుతూ సమయాన్ని వృ«ధా చేశారు గాని.. రైతులను ఆదుకోలేదన్నారు. పెథాయ్‌ తుపానులో రైతులు నష్టపోయి బిక్కుబిక్కుమంటూ ఉంటే..రాజకీయాలు కోసం చంద్రబాబు కలకత్తా పర్యటనకు వెళ్ళారని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌సీపీ స్పందించి విమర్శిస్తే..అప్పుడు అర్ధరాత్రి కూర్చోని డిసెంబర్‌ 19కల్లా నష్టపోయిన  పంటలన్ని లెక్కించి..డిసెంబర్‌ 25కల్లా చెక్కులు ద్వారా నష్టపరిహారం పంపిణీ చేస్తామని చెప్పారని, ఈ రోజు ఫిబ్రవరి 13 వచ్చింది.. కాని ఒక రైతుకైనా చెక్కు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆఖరికి రంగుమారిన « ధాన్యం  కొనే దిక్కు కూడా ఏపీలో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదన్నారు. చంద్రబాబు ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నారన్నారు.

ఎన్నికల ముందు ఒక రంగు..అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రంగు..ఈ సంవత్సరం కాలం మరో రంగు అని ఎద్దేవా చేశారు.ప్రత్యేక హోదా వద్దని,సంజీవని కాదని తెలిపిన చంద్రబాబు..ప్రత్యేకహోదాపై ఉద్యమం చేయడానికి వెళ్తున్న ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కనీసం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు కూడా రాకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు..నేడు ప్రత్యేకహోదా అంటూ కొత్త రంగు..కొత్త పల్లవి అందుకున్న చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రత్యేకహోదా అనడం లేదని..ప్రజలు రోడ్డు మీద నిలదీస్తారనే భయంతోనే ప్రత్యేకహోదా అంటూ డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చూసి భయపడి చంద్రబాబు ప్రత్యేకహోదాపై యూటర్న్‌ తీసుకున్నారని తెలిపారు.

Back to Top