బీసీలపై చంద్రబాబు మొసలి కన్నీళ్లు..

నాలుగున్నరేళ్లు గుర్తుకురాని బీసీలు..ఎన్నికల ముంగిట గుర్తుకొచ్చారా..?

వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి...

హైదరాబాద్‌:బీసీల పట్ల చంద్రబాబు మొసలికన్నీళ్లు కారుస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాలు గుర్తుకు రాని బీసీలు ఎన్నికల ముంగిట గుర్తుకువచ్చారా అని ప్రశ్నించారు. అధికార పీఠం కోసమే తప్పితే  బలహీన వర్గాల అభివృద్ధికి, మేలు కోసం కాదన్నారు. దివంగత మహానేత  వైయస్‌ఆర్‌..బలహీనవర్గాల యువతను ఉన్నత విద్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెడితే.. చంద్రబాబు ప్రభుత్వంలో  30 శాతం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందని పరిస్థితి ఉందన్నారు. రాబోయే రోజుల్లో  నూటికి నూరు శాతం  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాననే ఒక మాట కూడా చంద్రబాబు చెప్పడం లేదన్నారు. బీసీలకు తాయిలాలు ఇచ్చి వారి ఓట్లను కొల్లగొట్టాలనే ఆలోచన తప్పితే చంద్రబాబుకు మరో ఆలోచన లేదన్నారు.

కొన్ని వందల మంది బీసీ,ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు  ట్రిబుల్‌ ఐటిల్లో ఫీజులు,హాస్టల్‌ చార్జీలు కట్టలేక వారి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో బలహీనవర్గాలకు నష్టం కలిగే విధంగా నిబంధనలు ఉన్నాయని.. దీనిపై కనీసం టీడీపీ ప్రభుత్వం ఆలోచన కూడా చేయలేదన్నారు. ఇటీవల మెడికల్‌ సీట్లలో మెరిట్‌లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులు.. ప్రభుత్వ నిబంధనలతో నష్టపోయారన్నారు. వారు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా కనీస స్పందన లేదన్నారు. బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచన టీడీపీ ప్రభుత్వం చేయలేదన్నారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అయినా సరే కొత్తగా ఉద్యోగవకాశాలు కల్పించి బీసీ,ఎస్సీ,ఎస్టీ యువతకు అవకాశాలు కల్పించాలని కాని టీడీపీ ప్రభుత్వం అటువంటి పనిచేయలేదని మండిపడ్డారు. సుమారు రెండున్నర లక్షల పోస్టుల ఉద్యోగాల ఖాళీలుంటే ఎందుకు  భర్తీ చేయడంలేదని బీసీలంతా ప్రశ్నిస్తున్నారన్నారు. నాలగున్నర సంవత్సరాలో భూ కేటాయింపులు లేకుండా ఒక కేబినెట్‌ సమావేశం కూడా జరగలేదన్నారు.

కేబినెట్‌లో ఇసుకను ఎలా  దోపిడీ చేయాలనే దానిపై చర్చలు జరుపుతారన్నారు. ప్రభుత్వం భూములను అప్పనంగా ధనవంతులకు,కోటేశ్వరులకు,ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అప్పగిస్తారని దుయ్యబట్టారు. ఒక ఎకరమైనా రాష్ట్రంలో బీసీ రైతుకు గాని.బీసీ పేదవారికి గాని  ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీ జీవితాల్లో మార్పుతీసుకొచ్చే విధంగా ఒక కార్యక్రమం కూడా నిర్వహించలేదన్నారు. 100 కోట్ల రూపాయలతో ఫూలేపేరుతో బీసీ భవన్,  125 అడుగల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతివనం నిర్మిస్తాను అని చంద్రబాబు చెప్పారు. ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్‌ను నిర్మించానని గొప్పులు చెప్పుకునే చంద్రబాబు.. ఐదు సంవత్సరాల్లో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేకపోయావు అని ప్రశ్నించారు.  నేడు బలహీనవర్గాలకు బీసీ భవన్‌ నిర్మిస్తానంటే నమ్మడానికి  ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

యాదవులు ప్రత్యేక కార్పొరేషన్‌ కావాలని అసెంబ్లీకి పయనమయితే వారిని మంగళగిరిలో అరెస్ట్‌చేయించిన చంద్రబాబు.. నేడు యాదవ కార్పొరేషన్‌ ఇస్తానంటాడు. తొలు తీస్తానని  మత్స్యకారులను బెదిరించిన చంద్రబాబు వారికి  కార్పొరేషన్‌ ఇస్తానంటాడు.  నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని దూషణలకు పాల్పడ్డ చంద్రబాబు వారికి కార్పొరేషన్‌ ఇస్తానంటాడు.. ఇందంతా బీసీలు అర్థం చేసుకోవాలని సూచించారు. బీసీల పట్ల ప్రేమలేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గతంలో ఎన్టీరామారావు పేదలకు మేలు చేసే కిలో రెండు రూపాయల  బియ్యం పథకం పెడితే.. ఆ పథకం వలన  రాష్ట్రం దివాళా తీసిందని చెప్పి రెండు రూపాయల కిలో పథకాన్ని ఐదున్నరకు పెంచిన ఘనుడు  చంద్రబాబు అని అన్నారు. ఎంతసేపు కొత్త పథకాలు గురించే మాట్లాడతాడు తప్ప చేసిన పనులను  చంద్రబాబు చెప్పుకోలేకపోతున్నారన్నారు. 

 

Attachments area

Back to Top