వైయస్‌ జగన్‌తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం సాధ్యం

వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పార్థసారధి
 

ఏలూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి అన్నారు. ఏలూరులో ఏర్పాటు చేసిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రతో బాబుల బాక్స్‌లు బద్ధలయ్యాయి..ఇంకా ఏవైనా మిగిలి ఉంటే ఈ గర్జనతో పగిలిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయని కుట్రలు చేస్తున్నారన్నారు. ఐదేళ్లు ఈ రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టిన వ్యక్తి తప్పించుకునేందుకు ఇప్పుడు అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ అంటూ దొంగ అముదం రాసుకొని వచ్చినట్లు వస్తున్నారని విమర్శించారు.

మన జీవితాల్లో మార్పు కోసం వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు సిగ్గు ఉంటే రాజశేఖరరెడ్డి పాలనను జ్ఞాపకం చేసుకోవాలన్నారు. మహానేత చలువతో ఈ రోజు ఇంటికో డాక్టర్, ఇంజినీర్‌ ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నీ జీవితంలో ఒక్కటైనా మంచి పథకం ప్రవేశపెట్టావా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ఏడాది క్రితం ఒక అధ్యాయన కమిటీ ఏర్పాటు చేసి, వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు. బీసీల్లో కూడా సంచార జాతులు ఉన్నారని గుర్తించారన్నారు. పూసలు, జంగాలి వ్యక్తుల గురించి అధ్యాయనం చేశారన్నారు. చనిపోయిన తరువాత ఇచ్చే చంద్రన్న బీమా కావాలా? బతికున్నప్పుడు  ఇచ్చే బీసీ సంక్షేమం కావాలో ఆలోచన చేయండి. పింఛన్లు, ఇళ్ల కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు. బడుగులు తలెత్తుకొని బతకాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. 
 

Back to Top