ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోండి

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి

కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

విజయవాడ: ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోరింది. రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పలు అంశాలను ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికార దుర్వినియోగం చేసి రిగ్గింగ్‌ చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 59 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. నకిలీ ఓటర్లను తొలగించకుండా ప్రభుత్వం అధికారులను బెదిరిస్తోందని తెలిపారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పారు. సర్వేల పేరుతో ట్యాబ్‌లు ఇచ్చి టీడీపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ట్యాబ్‌లతో ఓటర్ల జాబితాలను తొలగిస్తున్న విధానాన్ని ఆధారాలతో చూపించామని తెలిపారు. నాన్‌ క్యాడర్‌ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమిస్తున్నారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. 
 

Back to Top