చింతమనేని రాజకీయంగా సమాధికాక తప్పదు

ఎంపీ పండుల రవీంద్రబాబు

పశ్చిమ గోదావరి : దళితులపట్ల అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎంపీ పండుల రవీంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే చింతమనేని రాజకీయంగా సమాధికాక తప్పదని హెచ్చరించారు. దళితులు రాజకీయాలకు పనికిరారంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘నోటి దురసు, కుల గజ్జితో మాట్లాడుతున్నావ్‌. అంబేద్కర్‌ భిక్ష వల్లే నువ్ ఎమ్మెల్యేగా తిరుగుతున్నావ్‌. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే రాజకీయంగా సమాధికాక తప్పదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయం’ అని రవీంద్రబాబు చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top