ఆ తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశావ్‌ బాబూ..

ఒక ఇరిగేషన్‌ ప్రాజెక్టయినా పూర్తిచేశావా..

వైయస్‌ఆర్‌ చేపట్టిన 54 ప్రాజెక్టుల్లో ఎన్ని పూర్తిచేశారు..?

పోలవరంపై హడావుడి తప్ప..బాబు చేసేందేమీ లేదు..

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి

విజయవాడ:చంద్రబాబూ..ఏనాడైనా ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారా అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.వైయస్‌ఆర్‌ హయాంలో మొదలు పెట్టిన 54 ప్రాజెక్టుల్లో ఎన్ని పూర్తిచేశారని ప్రశ్నించారు.బాబు చేసిందేమీలేదని, కాని పోలవరంపై హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.1995 నుంచి 2004 వరుకు మహారాష్ట్రలో అక్రమంగా అనేక ప్రాజెక్టులు,చెక్‌డ్యామ్‌లు,లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు నిర్మించారని,అదే సమయంలో పూర్తిగా ఆల్మటి డ్యాం నిర్మాణం కూడా జరిగిందన్నారు. ఆ తొమ్మిదేళ్లలో ఒక్కసారైనా ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై మాట్లాడారా అని ప్రశ్నించారు.

1995 నుంచి 2004 వరుకు అనేక ప్రాజెక్టులు పూర్తిచేయడం జరిగిందని, బ్రిజేస్‌కుమార్‌ ట్రిబ్యూనల్‌లో 70 టీఎంసీలు అదనంగా నీటిని కేటాయించడం జరిగిందన్నారు.కర్ణాటకలో ఎగువ తుంగ,సింగటూరు,ఆల్మటి డ్యాంలు ఆ పిరియడ్‌లో పూర్తి అవ్వడంతో బ్రిజేస్‌కుమార్‌ ట్రిబ్యూనల్‌ 170 టిఎంసీలు నికర జలాలను కర్ణాటకు కేటాయించడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తిచేయడకపోవడంతో బ్రిజెస్‌కుమార్‌ ట్రిబ్యూనల్‌లో మనకు అన్యాయం జరిగిన సంగతి తెలిసిందేనన్నారు. మేధావిని అని చెప్పుకునే చంద్రబాబు ఒక ప్రాజెక్టు కూడా ఆ పిరియడ్‌లో పూర్తిచేయలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నావల్లే పూర్తి అయ్యిందని చంద్రబాబు గొప్పలు చెప్పకున్నారని,ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనలో రెండుసార్లు శంకుస్థాపనలు చేసి పునాదిరాళ్లు వేసి వదిలేసిన విషయం వాస్తవం కాదా అని పశ్నించారు.

రాయలసీమలో గాలేరునగరి,ఓర్వకల్లు,అవుకు,గండికోట,సర్వరాయసాగర్,వెలిగొండ,పులిచింతల వంటి ప్రాజెక్టులు గురించి ఒక్కసారైనా తొమ్మిదేళ్ల పాలనలో ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.వైయస్‌ఆర్‌ జలయజ్ఞం ద్వారా 54 ప్రాజెక్టులను తీసుకోవడం జరిగిందన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2015లో అధికారికంగా ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక రిపోర్ట్‌ ఇచ్చిందని,అలాగే తెలుగుదేశం శ్వేత పత్రం కూడా విడుదల చేసిందన్నారు.40 వేల కోట్లు ఖర్చుపెట్టి 13 ప్రాజెక్టులు పూర్తయ్యాని,21 లక్షల 23వేల ఎకరాలకు సాగునీరు అందించామని మీ రిపోర్ట్‌లోనే ప్రకటించారన్నారు.

2018–19 నాటికి 19వేల 372 కోట్లు ఖర్చుపెట్టి 38 ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ప్రకటించుకున్నారు.కాని ఇప్పటికి 60 వేల కోట్లు ఖర్చుపెట్టినట్లుగా ఇరిగేషన్‌ మంత్రి చెబుతున్నారు.కాని ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశారా అని ప్రశ్నించారు. బ్రిజేస్‌కుమార్‌ తీర్పురాగానే ఆంధ్రకు అన్యాయం జరిగిందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నడిబొడ్డున వేలమందితో జలదీక్ష చేశారన్నారు.ఆ సమయంలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు చేపడుతుందని,వాటిని ఆపగలిగారా అని ప్రశ్నించారు.

Back to Top