రైతు కోటయ్యది ప్రభుత్వ హత్యే

పంట నాశనం చేస్తున్నారని ప్రశ్నించిందుకు పోలీసుల దాడి

రైతులను హత్య చేయడమేనా అన్నదాత సుఖీభవ

చంద్రబాబు మూలంగా కోటయ్య కుటుంబం అనాథగా మిగిలింది

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించి నిందితులను శిక్షించాలి

కోటయ్య మృతిపై చంద్రబాబు ప్రకటన బాధాకరం

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్ర

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

విజయవాడ: రైతు కోటయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని, చంద్రబాబు మూలంగా కోటయ్య కుటుంబం అనాథగా మిగిలిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. రైతును పోలీసులు కొట్టి చంపారని క్లియర్‌గా తెలుస్తుంటే.. కుటుంబ సమస్యలతో చనిపోయాడని చంద్రబాబు ప్రకటించడం బాధాకరమన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సిట్టిండ్‌ జడ్జితో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రైతులను చంపేస్తూ అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నాడని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ అంటే పంటలు నాశనం చేయడం, భుములు లాక్కోవడం, అడ్డు వస్తే పోలీసులతో దాడి చేయించడమేనా అని ప్రశ్నించారు. కొంత మంది పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేయడం మూలంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. 

హైకోర్టు కోటయ్య హత్యను సుమోటోగా తీసుకోని తక్షణమే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నాగిరెడ్డి కోరారు. అనాథలైన ఆ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఘటనా స్థలానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కోటయ్య మృతిగల కారణాలు కళ్లకు కట్టినట్లుగా అర్థం అవుతాయన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో.. నాగిరెడ్డి మాటల్లోనే.. 

చిలకలూరిపేట కొండవీడుకోటలో పిట్టల కోటయ్య అనే రైతు ఐదురుగు అక్కచెల్లల మధ్య ఒకే ఒక్క అన్నదమ్ముడు అతను సుమారు 5 ఎకరాల పొలం ఉంటే అమ్మేసి అప్పులు తీర్చి. మిగిలిన డబ్బుతో 14 ఎకరాలను కౌలుకు తీసుకొని దాంట్లో బొప్పాయి, కనకాంబ్రాలు సాగు చేస్తున్నాడు. కొండవీడుకోటలో ముఖ్యమంత్రి మీటింగ్‌కు వచ్చే అధికారుల పార్కింగ్‌ కోసం కోటయ్య పొలాన్ని ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కౌలు రైతును మా జోలికి రావొద్దని పోలీసులను కోటయ్య కుటుంబం బతిమిలాడింది. ఏదేమైనా పార్కింగ్‌కు భూమి ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తేవడంతో రోడ్డుకు ఆనుకొని ఉన్న రెండెకరాల భూమిలో పశుగ్రాసానికి జొన్న పంట వేసిన భూమిని ఇచ్చాడు. పార్కింగ్‌ కోసం ఇచ్చిన స్థలం కాకుండా బొప్పాయి తోటలో పడిన పోలీసులు, అధికారులు తోటను నాశనం చేశారు. తినిపడేసిన ఇస్తర్లు, మంచినీటి ప్యాకెట్లు, కోసిన బొప్పాయి కాయలు, తొక్కితే విరిగిన చెట్లు ఇవాల్టికి కనిపిస్తున్నాయి. చంటిబిడ్డలా పెంచుకున్న తోటను నాశనం చేయడం చూసి బాధేసిన రైతు పోలీసులను ప్రశ్నించి ఉంటాడని క్లియర్‌గా కనిపిస్తుంది. 

ప్రశ్నించే వాళ్లను తాటతీస్తా అని ముఖ్యమంత్రి అన్నట్లుగా, యాధా రాజా తదా ప్రజా, కానీ ఇక్కడ యధారాజా తదా పోలీసులు డిపార్టుమెంట్‌ అన్నట్లుగా ఉంది. ప్రశ్నించిన కోటయ్యపై పోలీసులు దాడి చేశారని క్లీయర్‌గా అర్థం అవుతుంది. తోట వద్ద ఏం జరిగిందని తెలుసుకోవడానికి కోటయ్య కుమారుడు ఆటో తీసుకొని వెళ్తే ఆటోను వెళ్లనివ్లేదు. కోటయ్య వెంట వెళ్లిన పాలేరును పోలీసు వేకిల్‌లో కూర్చోబెట్టారు. ఫోన్‌ను ఒక సీఐ తీసుకున్నాడు. పాలేరును పోలీస్‌ వాహనంలో ఎందుకు కూర్చొబెట్టారనే అనుమానంతో వారంతా ఒత్తిడి చేసి ప్రశ్నించారు. పోలీసులు సరైన సమాధానం చెప్పలేదు. కొన ఊపిరితో ఉన్నాడనే ఉద్దేశంతో ఆస్పత్రికి బయల్దేరితే సీఎం సభ అయ్యేంత వరకు ఆటోను కదలనివ్వలేదు. 

పబ్లిక్‌ ప్లేస్‌లో వ్యక్తి మరణించినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేసి పంచనామా రిపోర్టు చేసిన తరువాత పోస్టుమార్టంకు తరలించాలి. పురుగుల మందు తాగితే 8 గంటల్లో శరీరం రంగు మారుతుంది. మృతదేహం రంగు మారి వాసన వస్తుందన్నారు. కోటయ్య మృతదేహం పురుగుల మందు తాగినట్లుగా లేదు. పోలీసులు కొట్టడం మూలంగా చనిపోతే దాన్ని తప్పుదోవపట్టించడానికి చనిపోయిన వ్యక్తి నోట్లో పురుగుల మందు పోశారని అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కొడుకును ఎవరైనా కొడుతుంటే చూస్తూ ఊరుకోగలడా..? రైతు కోటయ్య కన్న బిడ్డలా పంటను సాగు చేసుకుంటుంటే దాన్ని నాశనం చేయడాన్ని సహించలేక పోలీసులను ప్రశ్నించాడు. 

సాక్షి పత్రిక, సాక్షి టీవీ, ప్రతిపక్షం లేకపోతే ఈ విషయం బయటకు వచ్చి ఉండేది కాదు. ఏంటీ అమానుషం. రాష్ట్రంలో ప్రశ్నించే వారిని ప్రతి ఒక్కరిని చంపేస్తారా..? ఈ అరాచకపాలన అంతం లేదా..? 

అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మారితే రైతుల ఆత్మహత్యలు ఎక్కడా లేవని అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. పొంతనలేని విధానాలు ఎవరిని మోసం చేయడానికి చేస్తున్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు కార్యక్రమం మూలంగా కోటయ్య కుటుంబం అనాథగా మిగిలిందని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Back to Top