వైయస్‌ జగన్‌ అనుకున్నది సాధిస్తారు

రాజన్న రాజ్యం తీసుకొస్తారు..

పాదయాత్రే  జననేతను గెలిపించింది

వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మోహన్‌బాబు

తిరుపతి: ప్రజలకు మంచి చేయాలనే తపన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో కనబడుతుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మోహన్‌బాబు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు భరోసాగా నేను ఉన్నానని వైయస్‌ జగన్‌ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ప్రజలు వైయస్‌ జగన్‌కు పట్టం కట్టడంతో చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ తనయుడిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన బాటలో నడుస్తూ ప్రజలందరికి మేలు చేస్తారని తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై భగవంతుడు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.పాదయాత్రే వైయస్‌ జగన్‌ను గెలిపించిందన్నారు.వైయస్‌ జగన్‌ అనుకున్నది సాధిస్తారని తెలిపారు. 

Back to Top