కాపీబాబు మాకొద్దు...

పోస్టుకార్డులతో వైయస్‌ఆర్‌సీపీ వినూత్న ఆందోళన...

తూర్పుగోదావరి:వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలను కాపీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేసినా ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.నవరత్న హామీలను చంద్రబాబు కాపీ కొట్టడాన్ని ఎద్దేవా చేస్తూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం జాతీయ రహదారిపై పోస్టుకార్టులతో వినూత్నంగా ఆందోళన చేశారు.చంద్రబాబుకు వ్యతిరేకంగా ’కాపీ బాబు..మాకొద్దు బాబు’, నిన్ను నమ్మం బాబు’ అంటూ ప్లెక్సీలతో నినాదాలు చేశారు.

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే పింఛన్‌ మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతానని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండేళ్లుగా హామీ ఇస్తున్నారని దీనిని చంద్రబాబు ప్రభుత్వం కాపీకొట్టి అమలు చేయడం జగన్‌ సాధించిన మొదటి విజయం అన్నారు.

Back to Top